వరంగల్

ఉద్యమంగా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 2: వరంగల్ జిల్లాలో 8వ తేదీ నుంచి రెండువారాల పాటు జరుగనున్న హరితహారం కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం వరంగల్ నుంచి జిల్లాలోని నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారికంగా ఈ నెల 8వ తేదీన హరిత కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు, మహిళలతో ర్యాలీలు నిర్వహించి మండల ప్రధాన కేంద్రంలోనూ, గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కోరారు. జిల్లా ప్రధాన కేంద్రంలో జాతీయ రహదారి వెంబడి 5కి.మీల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఒకరోజు అవెన్యూ ప్లాంటేషన్, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటవి ప్రాంతంలోని గట్ల మీద వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. మొక్కల రక్షణకు అవసరమైన ట్రీగార్డ్స్‌ను సబ్సిడీ ధరకు సరఫరా చేస్తామని, వీటి అమ్మకం ద్వారా వచ్చే నిధిని గ్రీన్‌ఫండ్‌గా వినియోగిస్తామన్నారు. అదే విధంగా మండలాల్లో ఉన్న దేవాలయాల, మసీదుల, చర్చిల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వాటి పరిధిలో గల ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్న చోట స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. మొక్కలు నాటేందుకు తీస్తున్న గోతుల్లో మొక్కలు నాటేటప్పుడు నాణ్యమైన మట్టిలో ఎరువు కూడా కలిపి వేయాలని తెలిపారు. వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని, ఒకవేళ రాని యెడల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో హరితమిత్ర అవార్డులకు కార్యక్రమంలో అంకితభావంతో పాల్గొని మొక్కల పెంపకానికి, మరికొంత మందికి అవగాహన కల్పించేందుకు కృషి చేసిన ఐదుగురు అధికారులకు హరితమిత్ర పేరు మీద అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. హరితహార కార్యక్రమ ప్రణాళికను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లుగానే కార్యక్రమం ప్రారంభం నుంచి ఏ రోజుకారోజు జరిగిన పనులపై నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పిడి శేఖర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ సిఇవో విజయ్‌గోపాల్, డిఎఫ్‌వో శ్రీనివాస్, సహకార శాఖ సంయుక్త రిజిస్ట్రార్ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.