వరంగల్

మొక్కల పెంపకంపై చైతన్యం తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 2: మొక్కల పెంపక అవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని శాంతి భద్రతల అదనపు డిజిపి, ఇన్‌చార్జి డిజిపి అంజనికుమార్ సూచించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత హరితహారం సందర్భంగా పోలీసు పక్షాన నిర్వహించే హరితహారంపై ఇన్‌చార్జి డిజిపి వరంగల్ పోలీసు కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని పోలీసు విభాగం తరపున నిర్వహించాల్సిన విధానంపై ఇన్‌చార్జి డిజిపి అంజనికుమార్ కమిషనర్ సుధీర్‌బాబుకు సూచనలు చేశారు. ముఖ్యంగా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే నాటిన మొక్కలను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా వ్యక్తులను నియమిస్తూ వారి ద్వారా మొక్కలకు నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ హరితహారంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పక్షాన రెండు లక్షల మొక్కలు నాటించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలోని పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, పార్కులు, గ్రామంలో ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు.