వరంగల్

అద్దె గర్భం పేరుతో నిలువు దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 17: అద్దె గర్భం పేరుతో నిరుపేద దళిత గిరిజన మహిళల ఆరోగ్యాలతో దళారులు చెలగాటమాడుతున్నారని రాష్ట్ర మహిళా కమిటీ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. కొందరు దళారులు దళితుల పేదరికాన్ని ఆసరాగా తీసుకుంటూ వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని అన్నారు. మహిళా చట్టాలపై వరంగల్‌లో జరిగిన రెండు రోజుల సదస్సులో పాల్గ్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆమె గురువారం హన్మకొండ సర్కిల్ గెస్ట్‌హౌస్‌లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం మాట్లాడారు. అకారణంగా గర్భసంచి తొలగిస్తూ మహిళల అనారోగ్యానికి కారణమవుతున్నారని అన్నారు. ఇందులో మెడికల్ మాఫియా హస్తం ఉందని, ఇది సరైంది కాదన్నారు. అద్దె గర్భం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎవరూ సహాయపడరని, కుటుంబం నష్టపోతుందని, ఇది మహిళలు గమనించాలని కోరారు. ఆడ పిల్లల అక్రమ రవాణా, అద్దె గర్భం రాకెట్లు నడుస్తున్నాయని, వీటిని నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు గల్ఫ్ దేశాలకు పని నిమిత్తం వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సందర్భాల్లో వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల రాష్ట్రంలో ఆత్మహత్యల శాతం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేసిందని, ఎలాంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయాలన్నారు. కౌనె్సలింగ్ సెంటర్లు ఉన్నాయని, ఆత్మహత్యలు లాంటి తొందరపాటు నిర్ణయాలను ఎవరూ కూడా తీసుకోవద్దని తెలిపారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అటువంటి సంఘటనలు జరిగితే బ్లాక్ మెయిల్స్‌కు బెదరకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2002 ప్రకారం వివాహాన్ని విధిగా రిజిస్టర్ చేయాలని, తద్వారా భద్రత లభిస్తుందన్నారు. ఏదైనా సమస్యలు వస్తే సులువుగా పరిష్కరించవచ్చన్నారు. మన దేశంలో జరిగిన వివాహాలకు యుఎస్‌ఏ, యుకె లాంటి దేశాల కోర్టులలో విడాకులు మంజూరు చేసే వీలులేదని, ఎన్‌ఆర్‌ఐ మోసాలను వివాహ నమోదు చట్టం ద్వారా అడ్డుకోవచ్చన్నారు. గ్రామంలో 90 శాతం సమస్యలు మద్యపానం వల్ల తలెత్తుతున్నాయని, ప్రభుత్వం జిల్లాలో గుడుంబాను నిర్మూలించేందుకు చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. డిఆర్‌డిఏ, డ్వాక్రా సంఘాలు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు గ్రామాల్లోని మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, వీరికి చట్టాలపై అవగాహన కల్పిస్తే మరింత సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించగలరని, మహిళా చట్టాలపై జిల్లాలో రెండు రోజుల సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, సమాచార శాఖ ఉప సంచాలకులు డిఎస్ జగన్ తదితరులు పాల్గొన్నారు.