వరంగల్

టిఆర్‌ఎస్ మునిగే నావ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 17: టిఆర్‌ఎస్ పార్టీ మునిగే నావలాంటిదని.. 2019లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం గురువారం మొదటిసారిగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని విడిచి స్వార్థం కోసం టిఆర్‌ఎస్‌లో చేరిన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఎంతమంది నాయకులు పార్టీ వీడినా పార్టీకి వచ్చే నష్టమేమీలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీలో ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలే వచ్చాయని అన్నారు.అధికార పార్టీ తమ నాయకులను ఎంత ప్రలోభాలకు గురిచేసినా, ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నాయకులు ఎన్ని ఆగడాలు చేసినా ప్రజలు తమను ఆదరించారన్నారు. జిల్లాలో ప్రతిపక్ష పోషిస్తూనే ప్రజా సమస్యపై పోరాడుతామన్నారు. మున్సిపల్ కార్పోరేషన్‌లో తమ పార్టీకి చెందిన నలుగురు కార్పోరేటర్లు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని, వారికి అండగా తామంతా ఉంటామన్నారు. ఉగాది తర్వాత జిల్లాలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బస్సు యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ యాత్ర ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలోనే డివిజన్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, డివిజన్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత గ్రేటర్ వరంగల్ అధ్యక్షున్ని నియమిస్తామన్నారు. అదే విధంగా ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లో చేరిన తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య స్థానంలో మరో నేతను ఇన్‌చార్జిగా నియమించే అంశాన్ని టిపిసిసి పరిశీలిస్తుందన్నారు. సమావేశంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర నాయకుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. త్వరలోనే జిల్లావ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్, బట్టి శ్రీనివాస్, ఇవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.