వరంగల్

వారాహిగా భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్చరల్ (వరంగల్) జూలై 7: వరంగల్ నగరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారిని దశమహావిద్యలోని ఆద్యా విద్యయైన కాళి ఆరాధనా పద్ధతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపారు. ఈ ఉత్సవాలలో మూడవ రోజును పురస్కరించుకొని అమ్మవారిని ఉదయం కుల్లా క్రమంలో వారాహిగా సాయంత్రం నిత్యక్లిన్నా క్రమంలో అలంకరించి పూజారాధనలు చేసారు. సెలవు రోజు కావడంతో ఆలయానికి వివిధ జిల్లాల వా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతు కుల్లా క్రమంలో అమ్మవారిని దర్శించిన, ఆరాధించిన, ఉపాసన చేసిన వారికి కాళిని ఆరాధించిన వారిని సదా వారాహి అమ్మవారు రక్షించడమేకాకుండా అభయాన్నిస్తుందని అన్నారు. శత్రువులు జరిపే చెడు ప్రయోగాల బారినుండి కాపాడటమే కాకుండా భూత, ప్రేత, పిశాచి తదితర భయాలనుండి ఈ వారాహి అమ్మవారు రక్షిస్తుందని తెలిపారు. వారాహి మాతకు పూజలు చేయటం వలన అమ్మవారి కృప ఎల్లపుడు భక్తులకు ఉంటుందని కుల్లా క్రమం (వారాహి) అమ్మవారి విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేసారు. కాగా అమ్మవారిని దర్శించుటకు వచ్చిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో కట్టా అంజనీదేవి పర్యవేక్షించారు.