వరంగల్

వర్షాల కోసం జలాభిషేకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, జూలై 7: మండల కేంద్రంలోని ఆకులవారిఘనపురం పోచమ్మ, పోతరాజులకు భక్తులు, స్థానికులు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. గురువారం మండలంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, తద్వారా పంటలు సమృద్దిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు శిరస్సుపై నీళ్ల బిందెలతో, శివసత్తుల పూనకాలతో, మేళ తాళాలతోఆలయానికి చేరుకుని పోచమ్మ, పోతరాజుల విగ్రహాలకు జలాభిషేకాలుచేసి, పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోళ్ళు, మేకలను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు బల భద్రయ్య, రమణ పాల్గొన్నారు.