వరంగల్

మూడు పార్టీల్లో గ్రేటర్ అధ్యక్షులు ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 17: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దెబ్బకు మూడు ప్రధాన పార్టీల అధ్యక్ష పదవులు ఖాళీ అయ్యాయి. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న తాటిశెట్టి విద్యాసాగర్, టిడిపి అర్బన్ అధ్యక్షునిగా ఉన్న అనిశెట్టి మురళి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా పార్టీలకు వారు రాజీనామాలు చేసి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ రెండు పార్టీల అర్బన్ అధ్యక్ష పదవులు ఖాళీ అయ్యాయి. వీరికి అర్బన్ అధ్యక్ష కోటాలోనే టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా టిక్కెట్లు దక్కాయి. ఎన్నికలకు నాలుగు రోజులకు ముందే వీరు టిఆర్‌ఎస్‌లో చేరినా ఆ పార్టీల నుంచి అధ్యక్షులుగా ఉండటంతో టిఆర్‌ఎస్‌లో కార్పొరేటర్లుగా టిక్కెట్లు దక్కాయి. అదే విధంగా టిఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షునిగా ఉన్న నన్నపనేని నరేందర్ కూడా కార్పొరేటర్‌గా పోటీ చేయగా ఈ ముగ్గురు కూడా కార్పొరేటర్లుగా గెలుపొందారు. నన్నపనేని నరేందర్ ఏకంగా మేయర్ పీఠానే్న చేపట్టారు. మూడు పార్టీలకు చెందిన అర్బన్ అధ్యక్ష పదవులు ఖాళీ కావడంతో ఆయా పార్టీల నుంచి నాయకులు అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ మేయర్ పదవి చేపట్టడంతో ఆ పదవి దాదాపు ఖాళీ అయినట్లుగానే టిఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. అప్పుడే ఆ పదవి కోసం అనేక మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. టిఆర్‌ఎస్ అధికార పార్టీ కావడంతో అనేక మంది ముఖ్య నాయకులు సైతం రేసులో ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్, టిడిపి నుంచి కూడా అర్బన్ అధ్యక్ష పదవులు కోసం ఆ పార్టీల్లో పోటీ నెలకొంది. ఇప్పటికే అనేక మంది నాయకులు తమ కంటే తమకే అర్బన్ అధ్యక్ష పదవి కావాలంటూ ఆయా పార్టీల పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి పార్టీల గ్రేటర్ అధ్యక్ష పదవులు భర్తీ కానున్నాయి.