వరంగల్

మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు/ములుగుటౌన్, జూలై 9 : మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. హరితహారం రెండో విడత కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి మండలంలోని పందికుంట, ములుగు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం, జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగుంటూరుపల్లి ఇంగ్లిష్‌మీడియం పాఠశాలలోజిల్లా కలెక్టర్ వాకాటి కరుణతో కలిసి మొక్కలను నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో గతంలో దట్టమైన అడవి కలిగి ఉండేదని, ప్రస్తుతం చెట్లు ఎక్కడా కనబడడంలేదని అన్నారు. హరితహారం ద్వారా ములుగు నియోజకవర్గంలో 40లక్షల మొక్కలను నాటడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మొక్కలు నాటడమేకాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామంలో అధికారులే కాకుండా రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరితహారం జిల్లా స్పెషలాఫీసర్ పృథ్వీరాజ్, ఐటిడిఎ పిఒ అమయ్‌కుమార్, ఆర్‌డిఒ చీమలపాటి మహేందర్‌జీ, నార్త్ డిఎఫ్‌ఒ భీమానాయక్, వైల్డ్‌లైఫ్ డిఎఫ్‌ఒ పురుషోత్తం, జడ్పిఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఎంపిపి భూక్య మంజుల, తహసిల్దార్ సత్యనారాయణరావు, ఎంపిడిఒ విజయ్‌స్వరూప్, వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా వెంకటాపురం మండలంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో మంత్రి చందూలాల్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్కలను నాటి వాటి సంరక్షణను చూసుకోవాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం మూడురోజుల్లో సిసిరోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ దేవదాసు, తహసిల్దార్ హన్మంతరావు, ఎంపిడిఒ బాలకృష్ణ, రేంజర్ నాగేశ్వర్‌రావు, ఎంఇఒ ఐలయ్య, పాఠశాల స్పెషలాఫీసర్ సుమలత, మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ్ధర్, సర్పంచ్ గుగులోతు విజయ, ఎంపిటిసిలు దగ్గు ప్రభాకర్‌రావు, గాజుల సుమలత, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్ పాల్గొన్నారు.