వరంగల్

వైభవంగా కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్చరల్ (వరంగల్), 12: వరంగల్‌లోని భద్రకాళి దేవాలయ క్షేత్రంలో శాకంబరీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 8వ రోజు ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారిని ఉదయం ఉగ్రప్రభాదేవిగా సాయంత్రం త్వరితా క్రమంలో అలంకరించి ప్రత్యేక పూజలను జరిపారు. పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో దశమహావిద్యలోని ఆద్యవిద్యయైన కాళీ ఆరాధన పద్ధతిలో ఈ పూజారాధనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుటకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉగ్రప్రభమాతగా ఉన్న భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరుపుకొన్నారు. అనంతరం భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు భక్తులకు ఉత్సవాలలో అష్టమి తిథికి అదిదేవతలైన అమ్మవార్ల విశిష్ఠత గురించి వివరిస్తూ.. ఉగ్రప్రభ అమ్మవారు పనె్నండు చేతులు కలిగి కుడి చేతులలో అభయహస్తం, అంకుశం, దర్భలను, ఖడ్గమును, శక్తిని, వింటిని మరియు ఎడమచేతిలో వరదముద్ర, పాశము, శూలమును, కేటమును, పద్మమును, బాణాన్ని ధరించి ప్రకాశిస్తుందని తెలిపారు. భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ.. వారికి అభయాన్ని అందిస్తందన్నారు. ఈ అమ్మవారు అతివృష్టి.. అనావృష్టుల నుంచి కాపాడుతు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని వివరించారు. ఉత్సవాల నిమిత్తం ఆలయానికి వచ్చిన భక్తులకు ఈవో కట్టా అంజనీదేవి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు.