వరంగల్

నీలా క్రమంలో భద్రకాళి మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్చరల్ (వరంగల్) జూలై14: వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో శాకాంబరీ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం పూజలలో భాగంగా అమ్మవారిని ఉదయం నీలా క్రమంలో గాయత్రీమాతగా సాయంత్రం షోడశీక్రమంలో నిత్యాక్రమంలో ప్రత్యేక పూజలను జరిపారు. ఈ మేరకు భద్రకాళి శేషు మాట్లాడుతూ గాయత్రీ దేవి పంచ ముఖాలను కలిగి దశ భుజాలతో సౌమ్య స్వరూపినై భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ ప్రసన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.లక్ష్మణ్ భద్రకాళి మాతను దర్శించి ప్రత్యేక పూజలు చేసారు. ఆయనను ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంగళవాయిద్యాల నడుమ వల్లభగణపతిని దర్శించి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజారాధనలు జరుపుకొన్నారు. అనంతరం ఆయనను భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు మహదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాన్ని అందించి సత్కరించారు. తదుపరి అమ్మవారి మహాప్రసాదాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ జడ్జి రఘునందన్, జడ్జి గోవిందలక్ష్మి, మట్వాడ సిఐ జూపల్లి శివరామయ్య పాల్గొన్నారు.