వరంగల్

బృహత్తర కార్యక్రమం హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాయంపేట, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరతహార కార్యక్రమం బహృత్తరమైన కార్యక్రమమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం శాయంపేటలో రూ. 13 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి, ఇజిఎస్ రూ. 40 లక్షలతో వ్యవసాయ గోదాం నిర్మాణానికి, అసంతృప్తిగా నిలిచిన ఐకెపి భవన నిర్మాణానికి అదనపు నిధులు రూ. 11 లక్షలతో నిర్మాణాలకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. అనంతరం చలివాగు ప్రాజెక్ట్ ఖరీఫ్ సీజన్‌కు ఆయాకట్టు రైతులకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సాగు నీరు విడుదల చేశారు. చలివాగు ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన హారతహార కార్యక్రమంలో స్పీకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు తాగు, సాగు నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఖరీఫ్‌లో 3వేల ఏకరాలకు ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి చెరువులు జలకళతో నిండుకుండలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ పనులతో రైతులకు సాగునీరు రెండు పంటలకు అందుతుందన్నారు. హరితహారంలో భాగంగా చెరువు కట్ట సమీపంలో నాటిన మొక్కలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాటిన మొక్కలను ఎండి పోకుండా సంరక్షించుకోవాలని, మొక్కలను నాటటమే కాకుండా వాటిని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు.
ప్రభుత్వం దీక్షతో చేపట్టిన హరితహార కార్యక్రమంతో ఆకు పచ్చని తెలంగాణగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాసని రమాదేవి, జడ్పిటిసి వంగాల రమాదేవి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్, జిల్లా నాయకులు పొలపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల మహేందర్, సర్పంచ్‌లు ఇమ్మిడిశెట్టి రవీందర్, వలుపదాసు చంద్రవౌళి, ఎంపిడిఓ రమాదేవి, తహశీల్దార్ రజనీ, ఐబి డిఇ, ఏఇలు పాల్గొన్నారు.