వరంగల్

హరితహారంతోనే ఆకుపచ్చ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూలై 19: ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతోనే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి మండలంలోని జడ్పిహైస్కూల్‌లో నిర్మించిన అదనపు తరగతిగదులను ప్రారంభించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో ములుగు ప్రాంతాన్ని చూస్తే ముచ్చట వేస్తుందని, ఈప్రాంతంలోని దట్టమైన అడవుల మూలంగానే ఇక్కడ సమృద్ధిగా వర్షపాతం కురుస్తూ ములుగు నియోజకవర్గం గ్రీన్‌బెల్ట్‌గా కనిపిస్తుందని అన్నారు. 24 శాతం ఉన్న అడవులను 34శాతానికి పెంచేందుకు 46వేలకోట్ల మొక్కల పెంపకాన్ని సి ఎం తలపెట్టారని అన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన సూచించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ హరితవిప్లవంలో అందరూ భాగస్వాములు కావాలని, మొక్కలను కన్నబిడ్డలవలే సంరక్షించుకోవాలని సూచించారు.