వరంగల్

బిజెపికి ‘తమ్ముళ్ల’ ఝలక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 30: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయానికి తెలుగు తమ్ముళ్లే కారణమని బిజెపి నాయకులు అంటున్నారు. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు టిడిపి కార్యకర్తలు ఏమాత్రం సహకరించలేదని అంటున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి 2లక్షల పైచిలుకు ఓట్లు సాధించగా ఉప ఎన్నికలో లక్ష పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండి వరంగల్ జిల్లాకే అత్యధిక పథకాలను కేటాయించడమే కాకుండా ఉప ఎన్నికలో కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దించినా భారీ మొత్తంలో ఓట్లు తగ్గిపోయి డిపాజిట్లు గల్లంతు కావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి, అభ్యర్థిగా పోటీచేసిన పగిడిపాటి దేవయ్య, రాష్ట్ర నాయకుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలో ఓటమి గురించి నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. గత ఎన్నికలో బిజెపికి వచ్చిన ఓట్లు ఇప్పుడు ఉప ఎన్నికలో వచ్చిన ఓట్ల గురించి చర్చించారు. టిడిపితో పొత్తు బిజెపికి ఎప్పుడు కూడా లాభం జరుగలేదని, అదే విషయం మరోసారి ఉప ఎన్నికలో కూడా బయటపడిందన్నారు. టిడిపికి చెందిన ఓట్లు ట్రాన్స్‌ఫర్ కావడం లేదని ఈ ఎన్నికల్లో తేలిపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. బిజెపిని బలోపేతం చేస్తే తప్ప ఇంకొకరి ఓట్లపై ఆధారపడి పోటీచేస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని వారు సమావేశంలో చర్చించారు. టిడిపి నాయకులు చివరి వరకు వెంట ఉండ లేదని, పోలింగ్‌కు రెండురోజుల ముందే టిడిపి నాయకులు చేతులెత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందన్నారు. టిడిపి విధానాలు, బిజెపి విధానాలు భిన్నంగా ఉన్నాయని, దీంతో ఈ రెండు పార్టీలు కలవడం వల్ల కిందిస్థాయిలో క్యాడర్ కలవడం లేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులేకుండా వేర్వేరుగా పోటీ చేసి ఎంపి, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే పొత్తు ఉండడం వల్ల బిజెపి ఓట్లు టిడిపికి లాభం చేకూర్చుతాయని, అయితే, టిడిపి ఓట్లు మాత్రం బిజెపికి ట్రాన్స్‌ఫర్ కావడం లేదని అభిప్రాయపడ్డారు. టిడిపితో దాదాపు పాతిక సంవత్సరాలకు పైగా పొత్తుల కారణంగా బిజెపి క్యాడర్ చితికిపోతోందని, ఫలితంగా ఈ ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా ఓట్లు తక్కువగా వచ్చాయని భావిస్తున్నారు. పరకాల, స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జులు రాత్రికి రాత్రే పార్టీలు మారడంతో కింది క్యాడర్ అయోమయంలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో తెలుగు తమ్ముళ్లు చేతులెత్తేస్తున్నారని, దీంతో బిజెపి తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఈ ఎన్నికల పొత్తుపై రాష్ట్ర పార్టీ మరోసారి పునరాలోచించాలని సమావేశంలో కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో పాల్గొన్న బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ తాను ఉప ఎన్నికలో పరాజయం పొందినప్పటికీ ఓటరు తీర్పు శిరసావహిస్తానని, తాను వచ్చింది వరంగల్‌ను అభివృద్ధి చేయడానికే తప్ప తిరిగి అమెరికాకు వెళ్లడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు అందే విధంగా కృషిచేస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు పాటుపడతానని అన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్లను
సకాలంలో పూర్తిచేయాలి
* కలెక్టర్ వాకాటి కరుణ
నక్కలగుట్ట, నవంబర్ 30: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిర్థేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపిడివోలు, ఎపివోలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, గృహనిర్మాణ శాఖ ఎఇలు, ఎరియా కో- ఆర్డినేటర్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై మండలాల వారిగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 14 మండలాలకు మరుగుదొడ్ల నిర్మాణాలను మంజూరు చేశామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి, లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్ధేశించిన గడువులోగా పూర్తిచేయాలని తెలిపారు. గ్రామాల్లో కళాజాత ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకత, వినియోగంపై అవగాహన కల్పించాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల సమస్య లేదని, లబ్ధిదారులు సకాలంలో వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

మరో రైతు ఆత్మహత్య
నర్సంపేట, నవంబర్ 30: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేట మండలంలోని వల్లబ్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకొంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పట్టణంలోని వల్లబ్‌నగర్‌కు చెందిన ఓర్సు శంకరయ్య (30)కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ ఏడాది ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో పత్తి పంటను సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక పొలంలో పురుగుల మందు తాగి తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే పొలం వద్ద నుండి శంకరయ్యను ఏరియా ఆసుపత్రికి తీసుకరాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు నాలుగు లక్షల పైచిలుకు అప్పు ఉందని, తీర్చే మార్గం లేకపోవడంతో పాటు పంట దిగుబడి రాకపోవడంతోనే తన భర్త శంకరయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు మృతుడి భార్య సుగుణమ్మ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కూడా ఉన్నారు.

ములుగు ఎఎస్పీగా విశ్వజిత్ కంపాటి
ములుగుటౌన్, నవంబర్ 30: ములుగు ఏఎస్‌పిగా 2013 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన విశ్వజిత్ కంపాటి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డిఎస్పీగా విధులు నిర్వహించిన బానోతు రాజమహేంద్రనాయక్ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో విశ్వజిత్ కంపాటిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన ఏఎస్‌పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. చెన్నూర్‌లో ఎస్‌హెచ్‌వో ట్రైనింగ్ చేసినట్లు తెలిపారు. ములుగు ఏఎస్‌పిగా తనకు మొదటి పోస్టింగ్ అని ఆయన పేర్కొన్నారు. స్థానిక పోలీస్ అధికారుల సలహాలతో మేడారం జాతరను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లను చేపడుతామని అన్నారు.

పాఖాల ప్రతి చుక్క పొలాలకందిస్తాం
పరివాహక ప్రాంతంపై చెక్‌డ్యాంలు * టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం, నవంబర్ 30: పాఖాల సరస్సులోని ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి పంట పొలాలకు సాగునీరు అందిస్తామని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ధర్మరావుపేట, మునే్నరువాగు, ఆయకట్టు కాల్వలు, పాఖాల సరస్సులోని తూములను ఐబి అధికారులతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ పాఖాల సరస్సులోని సాగునీరు వృథాగా పోయి మునే్నరు వాగులో కలుస్తున్నాయని అన్నారు. ఆ నీటిని వృథా పోకుండా పాఖాల వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటల పొలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా పాఖాల సరస్సుపై కాకతీయులు నిర్మించిన తూముల నుండి లీకేజీ ద్వారా నీరు వృథాగా పోతున్నాయని అన్నారు. ఈ లీకేజీని అరికట్టేందుకు ఆధునిక పద్ధతుల్లో మరమ్మతులు చేపట్టి రబ్బరింగ్ సిస్టమ్‌తో తూముల నిర్మాణం చేపడుతామన్నారు. ఇందుకు కావాల్సిన ప్రతిపాదనల కోసం నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించామన్నారు. ఈ పద్దతి ద్వారా పాఖాల రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. త్వరలోనే నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కలిసి ఐబి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేసి ప్రతిపాదనలను నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల డిఇ సుదర్శన్‌రావు, సర్వేయర్ జనార్ధన్, ఇంజనీర్ శ్రీనాధ్, మండల శాఖ అధ్యక్షుడు ప్రకాశ్‌రావు, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి బత్తిని శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు సుభాన్‌బీ, వెంకటేశ్వర్లు, నర్సింహా, ఎంపిటిసి పూలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను సస్యశ్యామలం చేస్తాం
* ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
రఘునాథపల్లి, నవంబర్ 30: గ్రామాలను పాడిపంటలతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల సహకారంతో చెరువులను నింపి వ్యవసాయ సాగుకు నీరందిస్తానని స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం మండలంలోని గబ్బెట గ్రామ ఊట చెరువులోకి చేరుకున్న గోదావరి నీటిని ఎమ్మెల్యే రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దేవాదుల రిజర్వాయర్ ద్వారా 59 చెరువులను గోదావరి నీటితో నింపామని అన్నారు.అంతకుముందు మండలంలోని కోడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ఠ కమిటీ నిర్వాహకులు నలమాది ప్రభాకర్‌రెడ్డి, సుగుణాదేవి, జంగిలి రామకృష్ణారావు, మల్లయ్య, బక్కయ్య, సత్తయ్య, వేదపండితులు పాల్గొన్నారు.

పోలీసులు, ప్రజలకు మధ్య సంబంధాలు పెరిగాయి
* పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం పోలీసులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెరిగాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. సోమవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని భీమారం ఎస్‌విఎస్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉచిత పోటీ పరీక్షల శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందుతున్న యువతతో ఘంటా చక్రపాణి ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ నగర యువతతో పాటు గ్రామీణ యువతకు దశదిశ చేసి వారిని సరైన మార్గదర్శకం చేస్తామన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు నిర్వహించబడే పోటీ పరీక్షల్లో యువత రాణించే విధంగా ఉండాలన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పోలీసు కమిషనరేట్ విభాగం యువత అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గత 50 సంవత్సరాలుగా తనకు పోలీసులతో ఎన్నో అనుభవాలు ఉన్నాయని, కాని పోలీసులకు కూడా మానవతా హృదయాన్ని కలిగి ఉండటాన్ని సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. పోలీసులు మంచి పనులు చేస్తారని తొలిసారిగా చూస్తున్నానన్నారు. పోలీసుల సహకారం లేకపోతే రాష్ట్రం ఏర్పాటయ్యేదే కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోలీసులు అధికంగా కృషి చేస్తున్నారని, పబ్లిక్ కమిషన్ ఏర్పాటు అనంతరం తెలంగాణకు ఎలాంటి భవిష్యత్తు ఉండాలి, నూతనంగా నియమించబడే ఉద్యోగి తెలంగాణలో 30సంవత్సరాలు విధులు నిర్వహించి తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన ఉద్యోగులు, తెలంగాణ చరిత్ర, ఉద్యమాల ఆర్థిక స్థితులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నేటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు వెలువడుతాయని అన్నారు. పోటీలకు పరీక్షలకు అవసరమైన సెలబస్‌పై యువత ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గ్రూపు-2కు ఉన్న సెలబస్‌ను అనుసరిస్తే యువత ఏ పరీక్షనైనా సులభంగా రాయవచ్చన్నారు. యువతకు పోటీల భయం పోవాలంటే వీలైనంత వరకు అన్ని గ్రూపుల పరీక్షలు రాయాలని సూచించారు. పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ వరంగల్ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వ కొలువులు సాధించడంతో పాటు ఇతరుల అభివృద్ధి కోసం తోడుగా నిలవాలని కోరారు. సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. అనంతరం సుమార్గ్ ద్వారా యువతకు పోటీపరీక్షల శిక్షణా తరగతుల నిర్వహణ కోసం కృషి చేస్తున్న పోలీసు కమిషనర్‌ను ఘంటా చక్రపాణి సన్మానించారు. కార్యక్రమాన్ని ఘంటా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ సౌత్ ఇండియా, ఐసిఎస్‌ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. కృష్ణారెడ్డి, డిసిపి యాదయ్య, ఎస్‌విఎస్ కళాశాల డైరెక్టర్ తిరుమలరావుతో పాటు నగర ఎసిపిలు పాల్గొన్నారు.