వరంగల్

ఆర్టీసీ ఎన్నికల్లో టిఎంయు హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా మంగళవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో టిఎంయు ఘనవిజయం సాధించింది. ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగగా రాత్రి 9:30 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. వరంగల్ రీజియన్‌లో 11 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న 9 డిపోలలో 9 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా ఆర్‌ఎం ఆపరేషన్, నాన్ ఆపరేషన్ రెండు పోలింగ్ బూత్‌లు కలిపి మొత్తం 11 బూత్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న 9 డిపోలలో కూడా టిఎంయు ఘనవిజయం సాధించింది. వరంగల్-1, వరంగల్ -2, హన్మకొండ, నర్సంపేట, జనగామ, పరకాల, తొర్రూరు, మహబూబాబాద్, భూపాలపల్లి డిపోలలో టిఎంయు జయకేతనం ఎగురవేసింది. వరంగల్-1 డిపోలో 596 ఓట్లకు గాను 574 పోలయ్యాయి. అందులో క్లాస్ -3 స్టేట్ గుర్తింపుకు గాను 380, రీజియన్ గుర్తింపుకు 380 పోల్ కాగా సమీప ఇయుకు కేవలం స్టేట్ గుర్తింపులో మాత్రమే స్టేట్‌లో 162 ఓట్లు వచ్చాయి. వరంగల్ -2డిపోలో 549 ఓట్లకు గాను 529 పోల్ అయ్యాయి. అందులో టిఎంయు స్టేట్‌లో 270, రీజియన్‌లో 280 ఓట్లు లభించాయి. హన్మకొండ డిపోలో 636 ఓట్లకు గాను 629 పోల్ అయ్యాయి. అందులో టిఎంయు స్టేట్ గుర్తింపులో 352, రీజియన్‌లో 344 ఓట్లు వచ్చాయి. ఎంప్లాయిస్ యూనియన్‌కు కేవలం స్టేట్‌లో 268 పోల్ అయ్యాయి.
మహబూబాబాద్‌లో..
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా మానుకోటలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మానుకోటలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఘన విజయాన్ని సోంతం చేసుకుంది. మానుకోట డిపోలో మొత్తం 337 ఓట్లు ఉండగా 329 ఓట్లు పోలయ్యాయి. వాటిలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ భారీగా ఓట్లు దక్కించుకుంది. మానుకోట డిపోకు టియంయు 245 ఓట్లు సాధించగా, రాష్ట్రానికి 247 ఓట్లు సాధించింది. సమీప పోటీ యూనియన్ ఎస్‌డబ్ల్యుఎఫ్, ఇయు కూటమి మానుకోట డిపోకు 72, రాష్ట్రానికి 83 ఓట్లను మాత్రమే సాధించింది. టిఎంయు విజయంతో ఆ యూనియన్ బాధ్యులు సంబరాలు జరుపుకున్నారు.
తొర్రూరులో..
తొర్రూరు డిపో పరిధిలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. 415 ఓట్లకు గాను 411 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టిఎంయు డిపో పరిధిలో 246, రాష్ట్రానికి 237 ఓట్లు సాదించి విజయం నమోదు చేశాయి. ఎస్‌డబ్ల్యు ఎఫ్, ఇయు కూటమి డిపోకు 140, రాష్ట్రానికి 159 ఓట్లు సాధించింది. పోటీలో ఉన్న మరో యూనియన్ టిఎన్‌ఎంయు డిపోకు 24, రాష్ట్రానికి 15 ఓట్లు సాధించి తన ఉనికి చాటింది.
పరకాలలో....
ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పరకాల, భూపాలపల్లిలో టిఎంయు విజయం సాధించింది. పరకాలలో మొత్తం 453 ఓట్లకు గాను 447 ఓట్లు పొలైనట్లు అధికారులు తెలిపారు. పరకాల డిపో పరిధిలో టిఎంయుకు 220 ఓట్లు, ఐఖ్య కూటమికి 188 ఓట్లు, ఎన్‌ఎంయుకు 24 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. 49 ఓట్లతో టిఎంయు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 1 ఓట్లు చెల్లలేదని, 6 ఓట్లు పోలు కాలేదని పరకాల డిపో మేనేజర్ మల్లేశం తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లిలో మొత్తం ఓట్లు 292 కాగా 290 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. టిఎంయుకు145 ఓట్లు రాగా ఐఖ్య కూటమికి 131 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌ఎంయుకు13 ఓట్లు రాగా 14 ఓట్ల మెజార్టితో టిఎంయు గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా జనగామ డిపో పరిధిలో 524 ఓట్లకుగాను 522 ఓట్లు పోలయ్యాయి. అందులో టిఎంయు 284, టిఎన్‌ఎంయు 204, ఎంప్లాయిస్ యూనియన్ 25 ఓట్లు కైవసం చేసుకున్నాయి. 80 ఓట్ల మెజార్టీతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో స్థాయిలో ముందంజలో నిలిచింది.
నర్సంపేటలో...
నర్సంపేట డిపోలో తెలంగాణ మజ్ధూర్ యూనియన్ జయకేతనం ఎగురేవేసింది. మంగళవారం జరిగిన గుర్తింపు ఎన్నికల్లో మరో మారు టిఎంయూ తన ఆధీక్యతను చాటి చెప్పింది. డిపోలో మొత్తం 462 ఓట్లు ఉండగా 459 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ మజ్ధూర్ యూనియన్‌కు క్లాస్ 3కు 254 ఓట్లు, క్లాస్ 6కు 228 ఓట్లు వచ్చాయి. ఎంప్లాయిస్ యూనియన్, స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్య కూటమికి క్లాస్ 3కి 140, క్లాస్ 6కు 179 ఓట్లు వచ్చాయి. అదే విధంగా నేషనల్ మజ్ధూర్ యూనియన్‌కు క్లాస్ 3కి 57, క్లాస్ 6కు 34 ఓట్లు వచ్చాయి. మిగతా యూనియన్లకు రెండు అంకెలు దాటలేదు.