వరంగల్

కళాకారులను గుర్తించడం సంతోషకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసముద్రం, మార్చి 18: తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన కళాకారులను ప్రభుత్వం గుర్తించడం సంతోషకరమని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి.ఎస్.జగన్ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ద్వారా జిల్లాలో ఎంపిక అయిన 96 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ పాల్గొని వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి కళాకారుల పాత్ర గొప్పదని అన్నారు. ఈ రోజుల్లో చదవడం ఒక ఎత్తు అయితే దీనికి తగ్గట్టు ఉద్యోగం చేయడం కష్టమని, ఇలాంటి నేపథ్యంలో కళాకారులుగా వృత్తిని చేపట్టి తమ రంగంలో దూసుకుపోతున్న వారికి ప్రభుత్వం గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారధి ద్వారా అధికారికంగా వారిని కళాకారులుగా నియమించడం సంతోషకరమైన విషయమన్నారు. వీరందరూ జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో కళారూపాలను ప్రదర్శిస్తారన్నారు. రాష్ట్రంలో పది జిల్లాలు ఉండగా ఒక వరంగల్ జిల్లా నుంచే 96 మందిని ఎంపిక చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి నెలా 25 రోజుల పాటు కళాకారులు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా తెలియపరచడానికి కళాకారులు తమ ప్రతిభను కనబర్చాల్సివున్నందున, ఎప్పటికప్పుడు వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సాంస్కృతిక సారధి అంటే సమాచార సారధిగా ప్రతి ఒక్క కళాకారుడు గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. కళా ప్రదర్శన ఇచ్చే ప్రాంతానికి సంబంధించిన జ్రలతో అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ డివిజనల్ పౌర సంబంధాల అధికారి బండి పల్లవి, ఎ.వి.సూపర్‌వైజర్ పి.రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా సాంస్కృతిక సారధి కో ఆర్డినేటర్ దార దేవేందర్, ప్రభుత్వం ద్వారా ఎంపికైన 96 మంది కళాకారులు పాల్గొన్నారు.