వరంగల్

పరకాల ఆస్పత్రిలో ఇది రెండో‘సారీ’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 23: పరకాల ఆసుపత్రిలో కాన్పు కోసం వస్తే పసికందు మృతి చెందడం ఇది రెండవ సంఘటన అని పలు పార్టీల నేతలు తెలిపారు. జూన్ 28న శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన గజ్జి శ్యాంసుందర్ తన భార్య శృతిని డెలివరీ కోసం తీసుకువస్తే డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఆపరేషన్‌కు ముందు నర్సు ఇంజక్షన్ వేయడంతో అప్పటికి కడుపులో ఉన్న బిడ్డ కదలికలు తగ్గిపోవడంతో పాటు గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయిందని శృతి భర్త శ్యాంసుందర్ తెలిపారు. అయితే, ఆ సంఘటన మరిచిపోకుండానే మళ్లీ కామారెడ్డికి చెందిన రాముకు కూడా జరగడంతో పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే గర్భిణులు జంకుతున్నారని పలు పార్టీల నేతలు పేర్కొంటున్నారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన, ధర్నా...
పసికందు మృతితో రాము బంధువులు, పరకాల యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధానకార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేదని, సదుపాయాలు కూడా లేవని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే నిధులు డాక్టర్లు మింగుతున్నారని ఆరోపించారు. జవాబుదారీతనం లేకపోవడంతో డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉండడంతో వారు సమయపాలన పాటించకుండా జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్న డాక్టర్లను తక్షణమే బదిలీ చేయాలని, సంఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

90శాతం మొక్కలు కాపాడితే..
10 లక్షల నజరాన
హరిహారం సమాజ శ్రేయస్సు కోసమే..: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
బచ్చన్నపేట, జూలై 23: నాటిన మొక్కల్లో కనీసం 90శాతం మొక్కలను కాపాడిన గ్రామపంచాయతీలకు రూ. 10లక్షల నజరాన అందజేస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిడ్ది ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలకేంద్రం బచ్చన్నపేట, ఆలింపూర్ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బచ్చన్నపేట మండలంలో 75వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించారని పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలని సూచించారు. ఏ గ్రామపంచాయతీ నాటిన మొక్కల్లో 90శాతం మొక్కలను కాపాడినచో తన నియోజకవర్గ అభివృధ్ది నిధులనుంచి రూ. 10లక్షలు గ్రామాభివృద్ధి పనులకు మంజూరు చేస్తానని బహుమతి ప్రకటించారు. నాటిన మొక్కల పెంపకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు బాధ్యత తీసుకోవానలి పేర్కొన్నారు. చంటి పిల్లలను పెంచేవిధంగా మొక్కలను పెంచితేనే అవి ఏపుగా పెరుగుతాయని అన్నారు. ఈ హరితహారం ముఖ్యమంత్రి కేసిఆర్ కోసమో, ప్రధానమంత్రి మోధికోసమో కాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఐసిడి ఎస్ అధికారిణి పద్మజారమణి పాల్గొన్నారు.

మొక్కలను పెంచుదాం..
కరవును తరిమేద్దాం
వనాలు ఉన్నచోటే సమృద్ధిగా వర్షాలు *ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
రాయపర్తి, జూలై 23: కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలను పెంచాలని వనాలు ఉన్న చోటే సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అందుకోసం ప్రతి ఒక్కరు హరితహార కార్యక్రమంలో భాగస్వాములై కరవును తరిమి వేయాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి కోరారు. హరితహార కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌తో పాటు మండలంలోని పెరికవేడు, కొండాపురం గ్రామాల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరై ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపి పసునూటి దయాకర్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వ్యవసాయ మార్కెట్, కొండాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏళ్ల తరుబడి పీడిస్తున్న కరవు రక్కసిని తరిమి వేయాలనే ఉద్దేశంతో మనస్సున మహారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితో ఆలోచించి మన తరాల వారికి కరవు కనిపించకుండా ఉండాలనే ధృడ సంకల్పంతో కోట్ల రూపాయలు వెచ్చించి హరితహార కార్యక్రమం చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటడమే కాకుండా వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం అందిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మిషన్ భగీరథ కార్యక్రమంతో ఇంటింటికి తాగునీరు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించారని అన్నారు. మిషన్ కాకతీయ పనుల ద్వారా ఎప్పుడో పూర్వికులు తీసిన చెరువుల పునరుద్దరణ కోసం పూడిక మట్టిని తీయించి నీటిని నిల్వ చేసే సామర్థాన్ని కల్పించారని అన్నారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకవెళ్లడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 320 గురుకుల పాఠశాలలు స్ధాపించి ఒకే సంవత్సరంలో స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. ఏపి సిఎం చంద్రబాబునాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టిఆర్‌ఎస్ పార్టీలో చేరి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఏపి సిఎం చంద్రబాబునాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న పనులను చూస్తు ఉండలేక ఆ పార్టీకి రాజినామా చేశానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుక వెళ్లుతానని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతు రైతుల అనందం చూడడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి తప్పకుండా రిజర్వాయర్ మంజూరు చేయిస్తామని అన్నారు. విద్య శాఖ నుండి రూ. 22 కోట్లు మంజూరు చేసి పాఠశాలల పునరుద్దరణ కోసం పాటుపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా పార్టి అధ్యక్షులు రవీందర్‌రావు, ఎంపిపి విజయ, జడ్పిటిసి యాకమ్మ, డ్వామా పిడి వెంకటేశ్వర్లరెడ్డి, వరంగల్ ఆర్‌డిఓ వెంకటమాధవరావు, మండల ప్రత్యేక అధికారి రాధకృష్ణ, తహశీల్దార్ రాంమూర్తి, ఎంపిడిఓ శంకరి, ఐబి డిఇ రమేష్, ఏఓ కవిత, ఎపిఓ ఫాతిమామేరి, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ అనూష పాల్గొన్నారు.

విలీన గ్రామాల అభివృద్ధికి కసరత్తు
నగరాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి * మేయర్ నన్నపనేని నరేందర్
వడ్డేపల్లి, జూలై 23: వరంగల్, హన్మకొండ, ఖాజీపేట పరిసర ప్రాంతాలలోని విలీన గ్రామాల అభివృద్ధికి కసరత్తు ప్రారంభించామని నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. శనివారం ఆరవ డివిజన్‌లోని తిమ్మాపురం గ్రామంలోని స్థానిక కార్పోరేటర్ చింతల యాదగిరి అధ్యక్షతన జరిగిన హరిత హారం కార్యక్రమానికి మేయర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహానగర పాలక సంస్థలో విలీనమైన 42 గ్రామాలలో 30 గ్రామాలు వర్థన్నపేట నియోజకవర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. విలీన గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు గ్రామాల అభివృద్ధికి నివేదికలు తయారుచేశామని తెలిపారు. వరంగల్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన 300 కోట్ల నిథులలో 150 కోట్లను విలీన గ్రామాల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాసన సభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఉపరితల భూగర్బ కాలుష్యం వలన తాగునీరు కలుషితం అవుతున్నదని, అడవుల విస్తీర్ణం ఇలాగే క్రమంగా కుంచింకుపోతే భవిష్యత్తులో ప్రాణవాయువును ఖరీదు చేయాల్సిన పరిస్థితులు వస్తాయని వివరించారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే విరివిగా మొక్కలు నాటి సంరక్షించడం ఒక్కటే మార్గమని తెలిపారు. సిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన వర్షాలు సమృద్దిగా పడి, రైతు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిథిలో హరిత హారం కింద ఏడు లక్షల మొక్కలు నాటామని తెలిపారు. అనంతరం మహిళలకు మేయర్, ఎమ్మెల్యే, సిపి మొక్కల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు పద్మ, కల్పన, పాలకుర్తి జడ్పీటిసి సారంగపాణి, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటి కమిషనర్ సురేందర్‌రావు పాల్గొన్నారు.

ఔను వీళ్లిద్దరూ..
ఒక్కటయ్యారు..!
చేతులు కలిపిన కడియం, ఎర్రబ్లెల్లి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూలై 23: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అనేది అక్షరాల నిజమని మరోసారి వరంగల్ జిల్లా నేతలు రుజువు చేశారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇద్దరి మధ్య మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ఉండేవి, నువ్వెంత.. అంటే.. నువ్వెంత.. అనుకుని, వ్యక్తిగత దూషణలకు దిగిన నాయకులు నేడు ఒక్కటయ్యారు. మధ్య కార్యకర్తలే బలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న హరితహార కార్యక్రమంలో ఆఇద్దరు నాయకులు కలిసిపోయారు. శనివారం వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన హరితహార కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. టిడిపి హయాంలో కూడా ఈ ఇద్దరి నాయకులకు ఒకరంటే ఒకరికి పడేది కాదు. టిడిపి అధికారంలో ఉండగా కడియం శ్రీహరి ఎర్రబెల్లికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డాడనే ప్రచారం అప్పట్లో జరిగింది. అప్పటినుండి వారి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమై టిఆర్‌ఎస్ బలపడింది. దీంతో టిడిపి పూర్తిగా బలహీనపడగా 2014 సాధారణ ఎన్నికలకు ముందే కడియం శ్రీహరి టిఆర్‌ఎస్‌లో చేరిపోగా ఎర్రబెల్లి టిడిపిలోనే కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుండి ఈ ఇద్దరి నేతల మధ్య మరింత దూరం పెరిగి ఒకరిపై ఒకరు దూషణలు దిగారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గాలి బలంగా ఉన్నా.. టిడిపి నుండే ఎర్రబెల్లి పాలకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందగా , కడియం శ్రీహరి టిఆర్‌ఎస్ నుండి వరంగల్ ఎంపిగా ఎన్నికై అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కడియం ఎంపి పదవికి రాజీనామా చేయడం.. ఎమ్మెల్సీగా ఎన్నికై డిప్యూటీ సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగానే ఎమ్మెల్యే దయాకర్‌రావు క్రమక్రమంగా టిడిపికి దూరమై టిఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్న క్రమంలో ఎర్రబెల్లిని టిఆర్‌ఎస్‌లోకి రాకుండా కడియం శ్రీహరిని తీవ్రంగా అడ్డుపడ్డాడు. అంతేకాకుండా ఎర్రబెల్లిని ఎట్టిపరిస్థితిలో టిఆర్‌ఎస్‌లో చేరనివ్వనని కడియం శపధం కూడా పూనాడు. ఆ ఇద్దరు నాయకులు జిల్లాలో ప్రతి రోజు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకొనేవారు. ఈ నేపథ్యంలో ముందుగా ఊహించినట్లుగానే ఎర్రబెల్లి టిఆర్‌ఎస్‌లో చేరారు. అమెరికాలో జరిగిన ఆట కార్యక్రమానికి సైతం ఇద్దరు నేతలు వెళ్లినప్పటికీ అక్కడ కూడా ఎడమొఖం పెడమొఖంగానే ఉన్నారు. హరితహారం ప్రభుత్వం కార్యక్రమం కావడంతో తప్పని సరిపరిస్థితుల్లో ఇద్దరు ఒక్కటి కాక తప్పలేదు.