వరంగల్

భార్య కళ్లెదుటే భర్త మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూలై 28: కేసముద్రం - మహబూబాబాద్ రహదారిలో రాజీవ్‌నగర్ వద్ద గురువారం ఉదయం కారు అదుపు తప్పి కల్వర్డును ఢీకొట్టిన ఘటనలో మహారాష్టక్రు చెందిన రమేష్ పండిట్ రాథోడ్ (47) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కాగా రాథోడ్ భార్యతో కలిసి కారులో ఖమ్మం నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా.. జరిగిన దుర్ఘటనలో భర్త మృతి చెందటంతో భార్య సంగీత షాక్‌కు గురైంది. మహారాష్టక్రు చెందిన రాథోడ్.. కురవి- ఖమ్మం మార్గ మద్యలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పనుల్లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం భార్య సంగీతతో కలిసి కారులో స్వగ్రామానికి బయలుదేరగా మహబూబాబాద్ దాటి కేసముద్రం వస్తుండగా రాజీవ్‌నగర్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో రాథోడ్ తలకు తీవ్రంగా గాయమై రక్తస్రావం అయ్యింది. ఈ ఘటన చూసిన కొందరు 108కు సమాచారం ఇవ్వగా వచ్చే సరికే రాథోడ్ మృతి చెందాడు. కేసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.