వరంగల్

ఎంసెట్ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 29: ఎంసెట్-2 ప్రశ్నాప్రతాల లీకేజి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఎంసెట్-2 పేపర్ లీక్ స్కాం పరకాల డివిజన్ నుండే ఆరోపణలు రావడం, బయటపడడంతో డివిజన్‌లో ప్రకంపనాలు సృష్టిస్తుంది. దీనిలో పలువురు విద్యార్థులు ఉన్నారన్న అంశం అసక్తి రేపింది. అంతేకాకుండా సిఐడి అధికారులు వీరిని పిలుపించుకొని పలు దఫాలుగా మాట్లాడడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సిఐడి అధికారులు పలువురు అనుమానితుల విద్యార్థుల జాబితాను అదనపు డిజిపి కార్యాలయం నుండి తీసుకొని మరి కొందరి అనుమానితులను కూడా విచారించినట్లు సమాచారం.
అయితే సిఐడి అధికారులు మొదటి విడతలో అనుమానితులుగా గుర్తించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సిఐడి అధికారులు ప్రాథమికంగా ప్రశ్నించారు. ఈ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్‌ల్లో వచ్చిన ర్యాంకుల్లో తేడాలను పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అక్రమాలు జరిగాయన్న వ్యక్తులు, ఇతరుల నుండి కూడా సమాచారాన్ని సిఐడి అధికారులు సేకరించారు. విద్యార్థులు గతంలో చదివిన పాఠశాలలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షలో వచ్చిన ర్యాంకుకార్డులు, విద్యార్థులకు గతంలో నిర్వహించిన పరీక్షల్లో మార్కులు, ఎక్కడ చదువుకున్నారు, విద్యా సంస్థలతో పాటు ఇప్పటికే దొరికిన నిందుతులకు వీళ్లకు మద్య ఉన్న సంబంధాలు పైన సిఐడి అధికారులు విచారించారు. సదరు విద్యార్థుల తల్లిదండ్రుల పేరున, విద్యార్థుల పేరున ఉన్న బ్యాంకు ఖాతాలను లావాదేవిలు, వీరి వినియోగిస్తున్న ఫోన్ సంభాషణలు సేకరించి పరిశీలించినట్లు సమాచారం. విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిర్ధేశిత తేది ఎక్కడెక్కడ ఉన్నారు, లీకేజి ప్రశ్నాప్రతాలు సేకరణకు మీరు ప్రయత్నాలు చేశారా లేదా, ఆరోపణల్లో నిజం ఎంత అనేక కోణాల్లో విచారణ కొనసాగించారు. వీరితో పాటు మరి కొందరి విద్యార్థులపైన దృష్టి కేంద్రికరించి విచారణ కూడా నిర్వహించారు. ఎంసెట్ ప్రశ్నప్రతం లీకేజి విషయంలో ఇప్పటికే మొదటి జాబితా ఆధారంగా విచారణ జరిపిన సిఐడి అధికారులు జాబితాను సిద్దం చేసి ఉన్నతాధికారులకు అందచేసినట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరి విద్యార్థులపైన దృష్టి కేంద్రికరించే అవకాశం లేకపోలేదు. అయితే అనుమానిత పేర్లతో మారోమారు సిఐడి అధికారులు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. లేకిజి విచారణలో దోషిలుగా తెలితే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులపై సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సిరియస్‌గా తీసుకోవడంతో విషయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుత ఉదంతంలో కఠినంగా వ్యహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.