వరంగల్

టిఆర్‌ఎస్ నేతలను వెంటాడుతున్న ఉద్యమ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడిచినా రైల్వే పరిధిలో ఉన్న తెలంగాణ ఉద్యమ కేసులు టిఆర్‌ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను వెంటాడుతూనే ఉన్నాయి. ఉద్యమ సమయంలో 72 గంటల పాటు రైల్‌రోకో చేపట్టిన సంఘటనలో సోమవారం కాజీపేట రైల్వే కోర్టుకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్దిసుదర్శన్‌రెడ్డితో పాటు మరో 9 మంది నాయకులు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నెక్కొండలో 72 గంటల పాటు చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఇదే రైల్‌రోకో కేసులో ఇప్పటికే స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పార్టీ ముఖ్య నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డిలే కాకుండా అనేక మంది ముఖ్య నాయకులు కూడా రైల్‌రోకో కేసులో రైల్వేకోర్టుకు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యమ కేసులను ఎత్తివేసినప్పటికి కేంద్ర పరిధిలో ఉన్న కేసులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈ నెల 7న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడిని రైల్వే కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. రైల్వే కేసుల్లో ముఖ్య నాయకులే కాకుండా అనేక మంది సామాన్య కార్యకర్తలు ఇప్పటికి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.