వరంగల్

సమ్మక్క పూజారి మృతిపై విచారణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఆగస్టు 5: తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన ఆనందరావు ఇటీవల ప్రమాదవశాత్తు గోవిందరావుపేట మండలం నార్లాపూర్ వద్ద మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. కాగా తన భర్త ఆనందరావు ప్రమాదవశాత్తు మృతి చెందలేదని, హత్యగావించబడ్డాడని మృతుని భార్య ఉషారాణి శుక్రవారం ఏటూరునాగారం ఏజన్సీలో హరితహారం కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ వాకాటి కరుణను కలసి విచారణ చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. తన భర్త మృతికి ముందు బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా సాంబశివరావు అనే వ్యక్తితో సాయంత్రం వరకు ఆనందరావు ఉన్నాడని, సదరు వ్యక్తిని విచారిస్తే తన భర్త మృతికి కారణం తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మృతిచెందిన ప్రదేశం ప్రమాదం జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదని, ముమ్మాటికి తన భర్తను హత్య చేశారని ఆమె కలెక్టర్ ఎదుట రోదించింది. ఆనందరావు తండ్రి సిద్దబోయిన లక్ష్మయ్య తనకు చేతికందివచ్చిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని, తన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వేడుకున్నారు.