వరంగల్

దర్జాగా కబ్జా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం 209 సర్వేనంబరులోగల ప్రభుత్వభూమి కబ్జాకు గురైంది. స్ధానిక తహశీల్దార్ కార్యాలయానికి ఎదురుగా ప్రధాన రహదారి పక్కనగల 209 సర్వేనంబర్ చెరువు శిఖం భూమిని కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జాచేసి ఇళ్ల నిర్మాణాలు సాగిస్తున్నారు. మండల కేంద్రంలో స్థలాలకు ధరలు పెరగడంతో ఖాళీగానున్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టి, దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ స్థల పరిశీలన చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, నిర్మాణాలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను కబ్జా కోరలనుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.