వరంగల్

చేనేతకు చేయూతనివ్వని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు మొండి చెయ్యి చూపిందని భారతీయ జనతా పార్టీ నేత వన్నాల శ్రీరాములు విమర్శించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రాష్ట్ర బడ్జెట్ బిసిలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. వరంగల్ టెక్స్‌టైల్స్ పార్కుకు 42 కోట్ల రూపాయలు, మరమగ్గాలకు కేవలం 11 కోట్ల రూపాయలను కేటాయించడం అన్యాయమని అన్నారు. తెలంగాణ వస్తే చేనేత కార్మికుల బతుకులు బాగుపడతాయని ఎన్నో సార్లు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో 545 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని కేటాయించిన నిథులు ఏ మూలకు సరిపోవని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకునే డబుల్ బెడ్ రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వమే ఇంటికి ఒక లక్షా 50 వేల రూపాయలు ఇస్తుందని తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా కేటాయించలేదని, ప్రణాలికేతర నిథుల కింద చూపించి అప్పులు తెస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. డబుల్ బెడ్ రూం పథకంలో ప్రభుత్వం విఫలమైతే ఆ నెపం కేంద్ర ప్రభుత్వంపై వేయడానికే రాష్ట్ర బడ్జెట్‌లో ఆ పథకానికి నిథులు కేటాయించలేదని స్పష్టం చేశారు.ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే పథకానికే నిథుల కొరతతో ఉన్న ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు కూడా కేంద్రం సహాయం అందుతున్నదని వివరించారు. రాప్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చిన నిథులను ప్రజలకు చెప్పకుండా, కేవలం రావలసిన నిథులపైన మాత్రమే మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిది, చెడు జరిగితే కేంద్ర ప్రభుత్వానిది అన్న చందంగా తెరాస శ్రేణుల ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. అందరిని ఎల్ల కాలం మోసం చేయలేమని, ప్రభుత్వం ఇప్పటికైనా నిజాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ యుగేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.