వరంగల్

అంగన్‌వాడీల బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం స్ర్తి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదవారైన నిజమైన లబ్ధిదారులకు చేరాలని మహిళా స్ర్తి, శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల లెజిస్లేటివ్ కమిటీ చైర్‌పర్సన్ అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మంగళవారం లెజిస్లేటివ్ కమిటీ సభ్యులు మహిళా, శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. లెజిస్లేటివ్ కమిటీ సభ్యులు ఉదయం నగరంలో పర్యటించిన అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ వికలాంగులు, వయోవృద్ధుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ రేఖానాయక్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించినట్లు, చిన్నచిన్న లోపాలు, సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు, నీటి సౌకర్యం, ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు పోస్టులు, జీతాలు సక్రమంగా రాకపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు సరఫరా అవుతున్న పప్పు, గుడ్డు నాణ్యత లేకుంటే తిరస్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన లోపాలను, సమస్యలను కమిటీ చర్చించి రాస్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ తెలిపిన సమస్యలపై కూడా కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పటిష్టం చేసేందుకు సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, వౌలిక వసతులు, బోధన తదితర అంశాలను పరిశీలించి ర్యాంకింగ్ చేస్తున్నట్లు తెలిపారు. పనితీరు సక్రమంగా లేని సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.