వరంగల్

మన పథకాలు.. దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలు దేశానికే తలమానికంగా నిలిచాయని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో ఒకే రోజు ఆరు లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జోగురామన్న మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో తాను ఓట్లు అడగనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని, అది సిఎం కెసిఆర్ ఒక్కడికే సాధ్యమని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ వచ్చిందన్నారు. గతంలో కాకతీయ రాజులు మాత్రమే చెరువులను తవ్వించారని, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన రాజులు, పాలకులు ఎవరూ చెరువుల్లో తట్టెడు మట్టిని ఎత్తిన పాపాన పోలేదన్నారు. మిషన్ కాకతీయతో రైతుల పాడిపంటలకు ఢోకా లేదన్నారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హరిత హారం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని వెల్లడించారు. అడవులు పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పారు.
ఆడపిల్లలను చదివించాలి
ఉద్యమంలో మహిళలు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదని, అదే స్ఫూర్తితో ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు తల్లితండ్రులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. సాధికారిత అనేది ఎవరో ఇస్తే పుచ్చుకునేది కాదని, ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే వారు జీవితంలో ఉన్నత రంగాల్లో స్థిర పడతారని చెప్పారు. మహిళా శక్తి ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించారని, అదే పరంపరను కొనసాగించాలని అన్నారు.
పెద్దిని అభినందించిన డిప్యూటీ స్పీకర్
పదవి లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు చేరుస్తున్న టిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిని పద్మాదేవేందర్‌రెడ్డి అభినందించారు. మొదటి విడత హరిత హారంలో, మిషన్ కాకతీయలో నర్సంపేట డివిజన్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని, అదే స్ఫూర్తితో రెండవ విడత హరిత హారంలో సైతం దూసుకుపోతోందని, ఇందుకు పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి అభినందనీయమని చెప్పారు.