వరంగల్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుూంనగర్, ఆగస్టు 29: స్వచ్ఛ్భారత్ మిషన్‌లో నగర ప్రజలంతా భాగాస్వాములు కావాలని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. సోమవారం పారిశుద్ధ్య సిబ్బంది, ఐటిసి వావ్ సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛ్భారత్- స్వచ్ఛవరంగల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. నగర ప్రజలకు ఆరోగ్య పరిశుభ్రతపై అవశ్యకతను తెలిపేందుకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానకార్యాలయం ఆవరణలో ప్రారంభమైన బైక్ ర్యాలీని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ మిషన్ క్రింద నగర ప్రజలకు ఇన్‌ఫర్‌మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ చేసేందుకు ర్యాలీని నిర్వహించామని చెప్పారు. నగర ప్రజలు స్వచ్ఛ వరంగల్ కోసం మనవంతు సహకారం అందించడానికి పాటుపడాలని అన్నారు. అలాంటపుడే స్వచ్ వరంగల్ కల సాకారం అవుతుందన్నారు. గతంలో గృహ, పారిశ్రామిక వ్యర్ధాలు వేరుచేయు విధానం చట్టంలో పేర్కోనలేదని అన్నారు. కేవలం ప్రజలు స్వచ్ఛందంగానే చేశారన్నారు. దీంతో వేరుచేయు భాద్యత నగరపాలక సంస్థ తమ భుజాన వేసుకున్నాయని అన్నారు. 2016నుండి భారత ప్రభుత్వం ఘన వ్యర్థలపై చేసిన చట్టంలో గృహ ఇతర వ్యర్దాల ఉత్పత్తి దారులే మూడు కేటగిరిలలో విభజించడం తప్పనిసరి చేశారన్నారు.