వరంగల్

సంచార జాతులకు సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, ఆగస్టు 30: సంచార జాతుల వాసులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మంగళవారం మండలంలోని భానాజీపేట గ్రామ శివారు పిట్టలగూడెంను సందర్శించి సంచార జాతుల తెగకు చెందిన నక్కల కులస్థుల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిట్టలగూడెంలో సుమారు 80కుటుంబాలు ఉన్నాయని, వారికి విద్యుత్, మంచినీటి సౌకర్యం అందిస్తామని ఆమె తెలిపారు. సంచార జాతుల వారి కోసం బాల వికాస ఆధ్వర్యంలో ఆర్‌వో మినరల్‌వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ భూములు లేని మహిళా గ్రూపులకు శ్రీనిధి పథకం ద్వారా గొర్రెలు, మేకలను అందిస్తామన్నారు. ఐటిడి ఎ ద్వారా నక్కల కులానికి చెందిన వ్యవసాయ భూముల్లో బోర్లను వేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కుటుంబ నియంత్రణ పాటించేలా, బడి ఈడు పిల్లలను పాఠశాలకు పంపించేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. పిట్టలగూడెంలో హెల్త్‌క్యాంపులు నిర్వహించడంతో పాటు, 65సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని ఆమె వివరించారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎస్సీలకు చెందిన భూములను కొనుగోలు చేసిన నక్కలవాళ్లకు త్వరలో పాసుబుక్కులు అందించాలని ఆమె ఆర్డీవో వెంకట్‌రెడ్డిని ఆదేశించారు. త్వరలోనే గూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పివో అమోయ్‌కుమార్, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, సిడబ్ల్యూసి చైర్మన్ అనితారెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్, జడ్పీటిసి బానోతు శారద, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపిడివో సరితలు పాల్గొన్నారు.