వరంగల్

నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 4: గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. వాడవాడలా కొలువుతీరేందుకు గణనాధుల మండపాలు సిద్ధమయ్యాయ. వినాయక చవితి సందర్బంగా నగరం సందడిగా మారింది. వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోళ్లతో సందడిగా మారింది. భాద్రపద శుద్ధ చవితిని పురస్కరించుకొని నేడు సోమవారం వినాయకచవితి పండుగను జిల్లా ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకోనున్నారు. ఆదిపూజ్యుడైన గణపయ్యకు స్వాగతం పలుకుతూ నగరంలోని పుర వీధులల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పూజలను చేయనున్నారు. యువత గణేష్ మండపాలను అలంకరించుకోవటంలో బిజీ బిజీగా మారారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులకు పోలీసులు, జిల్లా అధికార యంత్రాగం, ప్రజాప్రతినిధులు మట్టి వినాయకులను మాత్రమే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. త్రినగరిలోని ప్రముఖ గణపతిదేవాలయాలలో ఘనంగా గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహించుటకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేసారు. దేవాలయాలను అరటి ఆకులతో, మామిడి తోరణాలతో, వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఇందులో భాగంగా కాజీపేటలోని స్వయంభూగా ప్రకాశిస్తున్న శ్రీశే్వతార్కగణపతి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. ఉదయం 7గంటలకు పంచామృత, నవవిధఫల రసాలతో మరియు సప్తవర్ణాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 11గంటలకు ప్రత్యేక శే్వతార్క అర్చన, ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ, 3గంటలకు హోమ కార్యక్రమం, సాయంత్రం 7గంటలకు వంగర సోమయాజులు చే వినాయక చవితి విశిష్టత వంటి కార్యక్రమాలు జరుపనున్నారు. హన్మకొండ వేయిస్తంబాల దేవాలయంలో శుద్ధ చవితిని పురస్కరించుకొని ప్రత్యేక గణపతి పూజలను నిర్వహించనున్నారు. రుద్రేశ్వర ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజా, నవగ్రహపూజలను జరిపి ఆలయ మండపంలో గణపతి ఉత్సవమూర్తిని స్థాపించి పూజలను నిర్వహించనున్నారు.కాగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులతో పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు రెండు విడతల సమావేశాన్ని ఏర్పాటు చేసారు.