వరంగల్

శరవేగంగా జిల్లాల ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం దసరానుండే కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించడంతో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కదులుతోంది. గురువారం రాత్రి కలెక్టర్ వాకాటి కరుణ కలెక్టరేట్ సమావేశమందిరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశమైనారు. ఉద్యోగుల సర్ధుబాట్లు, కొత్త జిల్లాల కార్యాలయాలపై చర్చించారు. వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలతో పాటు మహబూబాబాద్, భూపాలపల్లి నాలుగు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లాల ఏర్పాటుపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించనున్నారు. హన్మకొండ జిల్లాకు బదులు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా ప్రకటన వెలువడుతుందా లేదా ముందుగా ముసాయిదా ప్రకటించిన హన్మకొండ జిల్లానే ఉంటుందా, జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో సిఎం ఎలాంటి క్లారిటీ ఇస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.