వరంగల్

ప్రకృతిని ఆరాధించడమే తీజ్ ఉద్దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, సెప్టెంబర్ 11: ప్రకృతిని ఆరాధించడమే తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశ్యమని మానుకోట ఎంపి ఆజ్మీర సీతారాంనాయక్ అన్నారు. ప్రభుత్వం రానున్న ఏడాది నుండి తీజ్‌ను గుర్తించి అధిక నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కోరారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యావతి రాథోడ్ పుట్టినిల్లు కురవి మండలంలోని గుండ్రాతి మడుగు శివారు పెద్దతండాలో జరిగిన తీజ్ ఉత్సవాలలో ఎంపి సీతారాంనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తీజ్ మంచె వద్ద కొబ్బరికాయలు కొట్టి ఎంపి పూజలను ప్రారంభించారు. అనంతరం మేలతాళాలతో తండా వీదుల గుండా తీజ్‌బుట్టలను(బతుకమ్మ)ను నెత్తిపై ఎత్తుకొని సీత్లా భవాని అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దచెరువులో సాంప్రదాయ బద్దంగా నిమజ్జనం చెశారు. తండా ఆడపడుచులు నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపి సీతారాంనాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5040కి పైగా తం డాలు ఉన్నాయని అందులో 1756 తండాలను గ్రామపంచాయితీలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని అన్నారు. రానున్న ఏడా ది నుండి తీజ్ ఉత్సవాలను రాష్టమ్రంతా ఒకే మారు నిర్వహించేలా ప్రభుత్వం చొరు వ చూపాలని, అం దుకు తగ్గట్టుగా గిరిజనులు, తండా పెద్దలు నిర్ణయా లు తీసుకోవాలని కోరారు. కేవలం 500 జనాభా ఉన్న తండాలను పంచాయితీలుగా మారిస్తే సరిపోదని కర్ణాటక రాష్ట్రం మాదిరిగా తండాల అభివృద్ధి కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఎంపి సీతారాంనాయక్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సాంప్రదాయాలను కాపాడుకునేందుకు గిరిజనులు ఐకమత్యంతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ రానున్న ఏడాదికి తీజ్ ఉత్సవాలకు అధికంగా నిధు లు కేటాయించాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్దే తెరాస ద్యేయం అని స్పష్టం చేశారు.
ఈ తీజ్ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే సత్యావతి రాథోడ్, బండి వెంకట్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, ఎంపిటీసీ పద్మావెంకట్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బిక్కునాయక్, కిషన్‌నాయక్ పాల్గొన్నారు.