వరంగల్

జిల్లాల నిర్మాణం శాస్ర్తియంగా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 11: ప్రజల అభీష్టం మేరకు నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని జెఎసి రాష్ట్ర స్టీరింగ్ కమిటి సభ్యుడు అంబటి శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు డాక్టర్ జగదీశ్వర్, నాడెం శాంతికుమార్, ఎర్ర యాకూబ్‌రెడ్డి, పాలాయి శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఐకాసా, జెఎసి, కుల సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు.
తెలంగాణ జిల్లా ల పునర్విభజన ప్రజల అబీష్టం మేరకు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిపాలన సౌలభ్యం, అభివృద్ది, పారదర్శకత కోసం కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే నూతన జిల్లాల నిర్మాణం శాస్ర్తియ బద్దంగా జరగాలన్నారు. ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జెఎసి చైర్మన్ కోదండరాం సైతం త్వరలో నర్సంపేటకు రానున్నారని చెప్పారు. గత ఆరు రోజుల నుండి నిత్యం ఆందోళనలు చేస్తున్నామని, నర్సంపేటను జిల్లాగా ప్రకటించాలని ఈమేరకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో అఖిలపక్షం, ఐకాసాల కు చెందిన నాయకులు బొందయ్య, సుధాకర్, రవీందర్, సారయ్య, ఓంప్రకాశ్, సుమన్, ప్రణయ్‌దీప్ మాదిగ, షేక్ జావీద్, పోలెబోయిన లక్ష్మయ్య, మాచర్ల రమేష్, గంగాడి సాంబిరెడ్డి, అంబటి యోగేశ్వర్, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.