వరంగల్

ముస్లిం, మైనార్టీలకు ప్రభుత్వ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ సెప్టెంబర్ 13: ముస్లిం మైనార్టీ ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధికి సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గ్రేటర్ వరంగల్ నగరమేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. మంగళవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని వరంగల్ ఎల్‌బినగర్ ఈద్గా, ఫోర్ట్‌రోడ్, పెట్రోల్‌పంప్ ఈద్గాలలో ముస్లిం సోదరులతో కలిసి మేయర్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలు, ప్రజలను ఆత్మీయ ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి మైనారిటీల విద్యా అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. షాదీ ముబారక్ పథకం కింద నిరుపేద ముస్లింల యువతుల వివాహం కోసం 51వేల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. మసీదులు, ప్రార్థనాస్థలాలు మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. రంజాన్, బక్రీద్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఈద్గా, మసీద్‌లో వౌలిక వసతులు ఏర్పాటు పరిశుభ్రతకు వరంగల్ మహానగరపాలక సంస్థ చేసిన ఏర్పాట్లను ఈ సందర్భంగా మేయర్ గుర్తుచేశారు. నగర పాలక సంస్థద్వారా నగర ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రేటర్ వరంగల్ ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మేయర్ స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధికి ముస్లిం మైనార్టీల ఆశీర్వాదం ఉండాలని మేయర్ ముస్లిం మతపెద్దలను, ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఈద్గాల కమిటీ సభ్యులు, మత పెద్దలు మేయర్ నన్నపనేని నరేందర్‌కు శాలువాకప్పి సత్కరించారు.