వరంగల్

బంద్ విజయవంతం అఖిలపక్షం రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, సెప్టెంబర్ 21: సమ్మక్క సారలమ్మ పేరుతో ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు, తుడుందెబ్బ ఇచ్చిన ములుగు డివిజన్ బంద్ పిలుపు మేరకు బుధవారం మంగపేట మండలంలో బంద్ విజయవంతం అయింది. మండల కేంద్రమైన మంగపేటతో పాటు, పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలో కూడా దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు మూసివేశారు. బంద్‌కు సహకరించాల్సిందిగా కోరుతూ అఖిల పక్ష నాయకులు, తుడుందెబ్బ నాయకులు మంగపేట, కమలాపురంలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ గుమ్మడి సోమయ్య, తుడుందెబ్బ ములుగు డివిజన్ అధ్యక్షులు కబ్బాక శ్రావణ్‌కుమార్‌లు మాట్లాడుతూ చారిత్రాత్మిక నేపధ్యం కలిగిన ములుగును జిల్లా చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. ములుగు కేంద్రంగా ఏర్పడితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వనరులు పుష్కలంగా ఉండి, జిల్లా కేంద్రంకు అనువుగా ఉన్న ములుగును కాదని బొందలగడ్డగా ఉన్న భూపాలపల్లిని జిల్లాగా ప్రకటించడం అవివేకమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూపాలపల్లిని జిల్లా ప్రకటించడాన్ని విరమించుకుని ములుగును శ్రీసమ్మక్క సారలమ్మ పేరుతో జిల్లాగా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుమ్మడి సోమయ్య, తుడుందెబ్బ ములుగు డివిజన్ అధ్యక్షులు కబ్బాక శ్రావణ్‌కుమార్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, యూత్ కాంగ్రేస్ ములుగు నియోజకవర్గ అధ్యక్షులు కొమరగిరి సురేష్, కమలాపురం ఎంపిటిసి చింతా సురేష్ (సుబ్బు), యూత్ కాంగ్రేస్ మంగపేట అధ్యక్షులు బట్టార్‌శెట్టి గౌతమ్, కాంగ్రేస్ మండల ప్రధాన కార్యదర్శి అల్లె జనార్ధన్, వర్తక సంఘం అధ్యక్షులు కొమరగిరి కేశవరావు, జ్వాలా యూత్ అధ్యక్షులు కోడెల నరేష్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోలెం నర్సింహారావు, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి హుస్సేన్,తుడుందెబ్బ నాయకులు రవి వర్మ, బోదెబోయిన రవి, పూనెం ప్రశాంత్, నర్సింగరావు పాల్గొన్నారు.