వరంగల్

వీడని ముసురు.. చెరువుల మత్తడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 24: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా శనివారం సైతం జోరుగా ముసురువాన కురుస్తూనే ఉంది. నాలుగు రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం అందరికి తెల్సిందే. నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డివిజన్‌లోని చెరువులు, కుంటలన్నీ నిండిపోయి మత్తళ్లు పోస్తున్నాయి. చిన్న చిన్న కాల్వలు తారు రోడ్లపై గల కాజ్‌వేలపై వరదనీటి ప్రవాహంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో మాధన్నపేట - నర్సంపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు శనివారం ఉదయం నుండి మత్తడి పోస్తోంది. సాయంత్రం వరకు మత్తడి నీరు మాధన్నపేట చెరువులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాధన్నపేట మత్తడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మద్యలవాగు, నందిగామ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ ఏజెన్సీలో బూర్గుగుంపు వాగు, గాంధీనగర్ ముసలమ్మ వాగు, కొత్తపల్లి వాగు, గుంజేడు ముసలమ్మ వాగులు తారు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు ఏజెన్సీ భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. చెరువుల, కుంటలు మత్తడి పరవళ్లు తొక్కుతున్నాయి. పాఖాల వాగు ప్రవాహం కొద్దిగా తగ్గింది. అయితే, పాఖాల చెరువు మరో కొద్ది గంటల్లో మత్తడి పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో గూడూరు బ్రిడ్జిపై నుండి నాలుగు నుండి ఆరు అడుగుల మేర పాఖాల వాగు ప్రవహించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో గూడూరు నుండి నెక్కొండ, కేసముద్రం మండలాలకు రాకపోకలకు నిలిచిపోనున్నాయి. కాగా, పంట పొలాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగితే వరి పంట పొలాలు మురిగిపోయే ప్రమాదం నెలకొంది. అదేవిధంగా చెన్నారావుపేట మండలంలోని కోపాకుల చెరువు మూడు అడుగులతో మత్తడి పడుతోంది. ముగ్గుంపురం సమీపంలో వరద తారు రోడ్డుపై మూడు అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో నర్సంపేట నుండి చెన్నారావుపేట మండలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
స్కూళ్లకు సెలవు..
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో చిన్నారులంతా ఇంటి వద్దనే గడిపారు.