వరంగల్

ఉప్పొంగిన వాగులు, వంకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, సెప్టెంబర్ 24: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నదాతలకు ప్రధాన కల్పతరువైన లక్నవరం చెఱువులోకి పూర్తిస్ధాయిలోకి నీరు వచ్చి చేరడంతో శనివారం నుండే చెఱువు మత్తడి పడుతుంది. గుండ్లవాగు ప్రాజెక్టు సైతం పూర్తిస్ధాయిలో నిండిపోవడంతో అన్నదాతలలో ఆనందం నెలకొంది. ఆగస్టు చివరి మాసంలో కురిసిన వర్షాలకు జులై నెలమొదటి వారంలోనే లక్నవరం చెఱువు నిండిపోయింది. అయితే ఆ తర్వాత వరుణుడి జాడ కనిపించక పోవడంతో ఫీటు మేర నీళ్లును రైతులు పొలాల కోసం వాడుకోవాల్సి వచ్చింది. దీంతో ఖరీఫ్ పంటకు ఢొకా లేకపోయిన రబీ పంటపై రైతులు పెదవి విరవాల్సి వచ్చింది. ఈనేపద్యంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లక్నవరం చెరువు మల్లీ మత్తడి పడతుండటంతో ఇక రబీ పంట సాగు ఇబ్బంది ఉండదని రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. గుండ్లవాగు ప్రాజెక్టు సైతం రెండు సార్లు మత్తడి పడటంతో పరిసర గ్రామాలలో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయని స్ధానికులు తెలిపారు. కాగా భారీగా కురుస్తున్న వర్షాల చల్వాయి గ్రామంలోని తడండ్ల లక్ష్మీకి చెందిన ఇళ్లు పాక్షికంగా కూలిపోగా తహాశీల్దార్ ములకనూరు శ్రీనివాస్ సంఘటన స్ధలాన్ని విఆర్ ఓతోకలిసి పర్యవేక్షించారు.
నర్సంపేట డివిజన్‌లో అపార నష్టం
నర్సంపేట: భారీ వర్షాలు రైతులను కొంప ముంచాయి. గత నాలుగు రోజులుగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల మూలంగా చెరువులు, కుంటలన్నీ నిండుకుని మత్తడ్లు (అలుగులు) పోస్తున్న విషయం పాఠకులకు తెల్సిందే. అయితే, చేతికి వచ్చిన మొక్కజొన్న నీట మునుగు తుండడంతో రైతుల కంట కన్నీరే మిగిలింది. జూన్ మాసంలో కురిసిన తొలకరి వర్షాలకు నర్సంపేట డివిజన్‌లోని కొత్తగూడ, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా నర్సంపేట డివిజన్‌లోనే మొక్కజొన్న పంట సాగవుతుంది. డివిజన్‌లోని కొత్తగూడ మండలంలోని రైతులు ప్రధానంగా తమ పోడు భూముల్లో మొక్కజొన్న పంటనే గత రెండు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది రైతుల మొక్కజొన్న పంటను కోసి నూర్పిడి చేసి ఆరబోశారు. మరికొంత మంది రైతుల పంట కోసే దశలో ఉంది. నూర్పిడి చేసిన మొక్కజొన్నలను రాసులు పోయగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్నలు తడిసి మొలకెత్తుతున్నాయి. చేన్లపై ఉన్న మొక్కజొన్న కంకులు తడిసిపోయి ఫంగస్ వస్తుండడంతో ఎరుపు రంగు పోయి గింజలన్నీ పాలిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను పండిస్తే తీరా చేతికి వచ్చిన పంట భారీ వర్షాలకు పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పత్తి మొక్కలలో విపరీతంగా నీరు నిల్వ ఉండడంతో మొక్కలన్నీ కుళ్లిపోతున్నాయి. వరదనీటి ప్రవాహం మూలంగా వరి పంటలపై ఇసుక మేటలు వేశాయి. డివిజన్‌లో ప్రధానంగా మొక్కజొన్న, పత్తి, మిర్చి, వరి పంటలకు అపార నష్టం ఏర్పడింది. దెబ్బతిన్న పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి, బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.