వరంగల్

ఇంకుడుగుంతలో పడి బాలుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడ, సెప్టెంబర్ 29: ఇంకుడు గుంతలో పడి రెండున్నరేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బోరింగ్‌తండాలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోరింగ్‌తండాకు చెందిన భూక్య అరుణ, రవీందర్ దంపతుల ఏకైక కుమారుడైన రెండున్నరేళ్ల కుమారుడు కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలి గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుమారుడి కోసం వెతకగా ఇంటి ముందు గల ఇంకుడుగుంతలో విగతజీవిగా కనిపించడంతో తల్లితండ్రులు బోరుమన్నారు. కార్తీక్ తల్లితండ్రుల రోదన అరణ్య రోదనగా మారింది. ఈ ఘటన బోరింగ్ తండాలో విషాదం నింపింది. ఇంకుడు గుంతకు సంబంధించి బిల్లు పూర్తిగా రాకపోవడంతో నిర్మాణాన్ని మద్యలోనే నిలిపివేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంకుడు గుంత వరదనీటితో మునిగిపోయింది.