వరంగల్

నర్సంపేటకు సబ్ కోర్టు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేట పట్టణానికి సబ్ కోర్టును మంజూరు చేసింది. ఈమేరకు సబ్ కోర్టు మంజూరుకు సంబంధించిన జీవో కాఫీలు మున్సిఫ్ కోర్టుకు అందాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తెలిపారు. నర్సంపేటలోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంబటి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రస్తుతం నర్సంపేటలో మున్సిఫ్ కోర్టు మాత్రమే ఉందని, సివిల్ కేసు ల కోసం మహబూబాబాద్, వరంగల్ సబ్, జిల్లా కోర్టులకు కక్షిదారులు నిత్యం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దీని మూలంగా కక్షిదారులతో పాటు న్యాయవాదులు తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా మహబూబాబాద్ వెళ్లి రావడంతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో కోర్టు సమయానికి హాజరు కాలేకపోవడంతో పాటు తిరిగి వచ్చేటప్పుడు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో నర్సంపేటలో సబ్ కోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు, ఎంపి, అధికారులకు పలుమార్లు విన్నవించామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారు లు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి నర్సంపేటకు సబ్ కోర్టు మంజూరు చేయించారని వెల్లడించారు. నర్సంపేటకు సబ్ కోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను సెప్టెంబర్ 29న విడుదల చేసిందని పేర్కొన్నారు. సబ్ కోర్టు ఏర్పాటు చేయడంతో కక్షిదారుల కేసులు త్వరగా పరిష్కారమవుతాయని, సబ్ కోర్టుకు మూడు సంవత్సరాల నుండి జీవితకాల శిక్షణలను అమలుచేసే అధికారం ఉం టుందన్నారు. సబ్ కోర్టు మంజూరును స్వాగతిస్తూ న్యాయవాదులు స్వీట్లు పంపిణీ చేశారు. రూ. 3లక్షల నుంచి రూ. 10లక్షల వరకు డబ్బుల రికవరీ, యాక్సిడెంట్ తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సబ్‌కోర్టు ఏర్పాటు మూలంగా దాదా పు 200ల మందికి ఉపాధి దొరుకుతుందన్నా రు. సబ్ కోర్టు మంజూరుకు కృషి చేసిన సిఎం కెసిఆర్, ఎంపి సీతారాంనాయక్, ప్రజాప్రతినిధులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు పింగిళి మాధవరావు, తండాసారంగపాణి, మోటూరి రవి, గూళ్ల అశోక్, రమేష్‌యాదవ్, సంజయ్‌కుమార్, కిరణ్, మహేందర్, వంశీకృష్ణ పాల్గొన్నారు.