వరంగల్

కన్నుల పండువగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, అక్టోబర్ 1: చారిత్రక వరంగల్ మహా నగరంలోని శ్రీ భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉత్సవాలు సందర్భంగా భద్రకాళి అమ్మవారు శైలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే భద్రకాళీ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు, నగర మేయర్ నన్నపునేని నరేందర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వీరిని ఆలయ వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా వల్లభగణపతిని దర్శనం చేసుకుని, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను జరిపారు. పూజానంతరం వేదపండితులు, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అతిథులకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఈవో కట్టా అంజనీ దేవి పర్యవేక్షించారు.

అద్భుతమైన పండుగ..
‘బతుకమ్మ’
శాయంపేట ఉత్సవాల్లో
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
శాయంపేట, అక్టోబర్ 1: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం తెలంగాణ జాగృతి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్ని ఆడపడుచులతో కలిసి బతుకమ్మ కోలాటం ఆడారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు బతుకమ్మ విశిష్టతను దేశదేశాలకు చాటిచెప్పేందుకు ఎంపి కల్వకుంట్ల కవిత తీసుకెళ్లిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ గొప్ప వజ్రాయుధంగా నిలిచిందని, తెలంగాణ ప్రజలు ప్రకృతిని ఆరాధించడంలో ముందు ఉంటారని చెప్పారు. బతుకమ్మ వేడుకల్లో ప్రోత్సాహక బహుమతులను ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను స్పీకర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్, తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ అమ్మ అశోక్, సర్పంచ్‌లు వలుపదాసు చంద్రవౌళి, ఇమ్మిడిశెట్టి రవీందర్, ఎంపిటిసిలు కందకట్ల రవి, బుట్టి రమేష్, జాగృతి యువత నాయకులు పాల్గొన్నారు.