వరంగల్

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 1: జిల్లా పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడుతున్న భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బందిని నాలుగు జిల్లాలకు కేటాయించి వర్క్ టు సర్వ్ ఉత్తర్వులను సిద్ధం చేయాలని తెలిపారు. విభజన అనంతరం ఏర్పడుతున్న జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుపై కలెక్టర్ శనివారం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో పలు శాఖల కార్యాలయాల ఏర్పాటుకు వసతులు ఏర్పాటుచేసిన కారణంగా ఆయా కార్యాలయాల్లో అవసరమైన వౌలిక సదుపాయాలు, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకోసం ఎంపిక చేసిన భవనాలకు అవసరమైన మరమ్మతులు ఇప్పటికే పూర్తిచేసారని, ఈనెల ఆరో తేదీలోగా కార్యాలయాల నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, ఆయా జిల్లా కార్యాలయాల ఫైళ్లను అక్కడికి తరలించి ప్రత్యేకంగా ఒక అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. హన్మకొండలో ఏర్పాటుచేసే మరో జిల్లా కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయాలనే ఉపయోగించుకోవాలని, దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసారు. సమావేశంలో రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీ శే్వత, జిల్లా రెవెన్యూ అధికారి శోభ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఇరిగేషన్ ఇంజనీర్లు
కాగా వరంగల్ సర్కిల్‌కు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది శనివారం కలెక్టర్ కరుణను కలుసుకుని జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లా కలెక్టరేట్ కోసం నీటిపారుదల శాఖ ఎస్‌ఇ కార్యాలయాన్ని ఎంపిక చేయటాన్ని వ్యతిరేకించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలతో కూడిన 60మందికిపైగా సిబ్బందితో పనిచేస్తున్న సర్కిల్ కార్యాలయాన్ని కలెక్టరేట్ కోసం తీసుకుని కనీస వసతులు లేని డిఎంసి కార్యాలయంలో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనటంతో తమకు ఇబ్బందులు కలుగుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 110సంవత్సరాల కిందట నిర్మించిన ఈ భవనంలో అత్యాధునికి వసతులతో రికార్డు రూం కొనసాగుతోందని అన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ కొత్త జిల్లా కలెక్టరేట్ కోసం ఎస్‌ఇ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తారని, వరంగల్ ప్రాంతంలో కలెక్టరేట్ భవనం త్వరలో నిర్మిస్తారని, ఆ తరువాత ఎస్‌ఇ కార్యాలయాన్ని తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే లిఖితపూర్వకంగా నిర్ణయం తెలిపేందుకు సిద్ధమని కలెక్టర్ తెలిపారు.