వరంగల్

నర్సంపేట మార్కెట్‌కు మొక్కజొన్న వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 2: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు పది రోజులుగా వెల్లువలా మొక్కజొన్న వస్తోంది. రాష్ట్రంలోనే నర్సంపేట డివిజన్‌లో ఈ ఏడాది మొక్కజొన్న అత్యధికంగా సాగయ్యింది. ప్రధానంగా కొత్తగూడ ఏజెన్సీలోని పోడు భూముల్లో వేలాది ఎకరాల్లో రైతాంగం మొక్కజొన్న పంటను సాగు చేశారు.
సకాలంలో వర్షాలు కురవడంతో మొక్కజొన్న చేతికి వచ్చింది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెఫెడ్ ప్రకటించిన మద్దతు ధర కన్నా అధికంగా ధర పలుకుతోంది. తొలి నాళ్లలో క్వింటాల్ మొక్కజొన్నకు పదిహేను వందల పైచీలుకు ధర పలికిన మొక్కజొన్న ప్రస్తుతం 18వందల నుండి పదిహేడు వందల వరకు పలుకుతోంది. గత నాలుగు రోజుల క్రితం వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసిన విషయం పాఠకులకు తెల్సిందే. అయితే అప్పటికే మార్కెట్‌కు వెల్లువలా మొక్కజొన్న వచ్చింది. మార్కెట్ ఆవరణతో పాటు మార్కెట్‌కు వెళ్లే ద్వారకపేట, సర్వాపురం బైపాస్ రోడ్‌పై రైతులు మొక్క జొన్నలను ఆరబోసుకోగా భారీ వరద నీరుకు చాలా మంది రైతుల మొక్కజొన్నలు కొట్టుకపోయాయి. కొంత మంది రైతుల మొక్కజొన్నలు తడిసిపోయాయి. రైతులు నూర్పిడి చేసిన తర్వాత మొక్కజొన్నలను నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకవచ్చి ఆరబోసుకుంటున్నారు. పూర్తిగా తేమతో కూడిన మొక్కజొన్నలను తీసుకరావడం వల్ల మార్కెట్‌లో రెండు, మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వర్షం పడితే రైతులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఈ ఏడాది మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో ధర లభించింది. మరో ఇరవై రోజుల పాటు మొక్కజొన్నలు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అడ్తీదారులు, వ్యాపారులు చెప్పారు.
రోడ్లపై మొక్కజొన్నలు..
వాహనదారుల ఇక్కట్లు
కాగా, నర్సంపేట నుండి మల్లంపల్లి వెళ్లే 365వ జాతీయ రహదారిపై సమీప గ్రామాల రైతులు మొక్కజొన్నలను ఆరబోస్తుండడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఐదు రోజుల క్రితం ఇన్నోవా వాహనం ద్విచక్రవాహానాన్ని ఢీకొనగా ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం పాఠకులకు తెల్సిందే. ఈ క్రమంలో ఎస్సై హరిక్రిష్ణ జాతీయ రహదారిపై మొక్కజొన్నలను ఆరబోయేవద్దని సూచించినా రైతులు పట్టించుకోకుండా నిత్యం మొక్కజొన్నలను ఆరబోస్తూనే ఉన్నారు. రాత్రి వేళల్లో నర్సంపేట నుండి మల్లంపల్లి వెళ్లే వాహనదారులు నానా యాతన పడుతున్నారు. అదే విధంగా మార్కెట్‌కు వెళ్లే బైపాస్ రోడ్డులో దాదాపు మూడు కిలోమీటర్ల మేర రైతులు మొక్కజొన్నలను ఆరబోసుకున్నారు. 30 ఫీట్ల సిసి రోడ్డులో దాదాపు పదిహేను ఫీట్ల మేర రోడ్డును ఆక్రమించుకున్న రైతులు తమ మొక్కజొన్నలను ఆరబోశారు. దీంతో ఈ మార్గంలో వెళ్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.