వరంగల్

బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 6: తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ అవసరం లేదని, బతుకు తెలంగాణ కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జిల్లాల ఏర్పాటులో శాస్ర్తియత కొరవడిందని, జిల్లాల ఏర్పాటు టిఆర్‌ఎస్ లబ్దికోసమేనన్నారు. గురువారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ టిఆర్‌ఎస్ నేతలతో మాట్లాడి జిల్లాలు ఫైనల్ చేశారని, అలాంటప్పుడు ప్రజాభిప్రాయం ఎందుకు స్వీకరించారని అన్నారు. ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతిపక్షాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. ఎవరి అభిప్రాయం వినకుండా ఒకసారి 24 అని, మరోసారి 27 అని, చివరకు 31అని స్పష్టత లేకుండా గందరగోళ పరుస్తూ జిల్లాల ఏర్పాటులో సిఎం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు సరికాదన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కరువు నివారణ చర్యలపై మొట్టికాయలు వేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని అన్నారు. కోర్టు మందలింపుతోనైనా రైతులకు నష్టపరిహారం చెల్లింపుపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలన్నారు. కరవుపై తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని కోరారు. మరోవైపు కేంద్రం కరవు సహాయం కోసం విడుదల చేసిన నిధులు రైతులకు అందడం లేదని అన్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ఏ పథకానికి డబ్బులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితిలో లేదన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి అప్పులెందుకు తెస్తున్నారని ప్రశ్నించారు.