వరంగల్

లోక్‌అదాలత్‌లో 11వేల కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 12: జాతీయ, రాష్ట్రీయ న్యాయసేవ అధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవా సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్‌అదాలత్‌లో మొత్తం 36 బేంచీలు ఏర్పాటు చేయగా అందులో 11,203 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ సి.విజయసారధి ఆచార్యులు తెలిపారు. ఇందులో సివిల్ కేసుల్లో వరంగల్‌లో 204, మహబూబాబాద్ 15, జనగామలో 3, నర్సంపేటలో 1, ములుగులో 35, పరకాల 12, మొత్తం 270 ఉన్నాయి. అదే విధంగా క్రిమినల్‌కేసుల్లో వరంగల్‌లో 5482, మహబూబాబాద్‌లో 141, జనగామలో 284, నర్సంపేటలో 284, ములుగులో 139, పరకాలలో 257, తొర్రూరు 156 మొత్తం 6743 ఉన్నాయి. అదే విధంగా బ్యాంకు రుణాలు, బిఎస్‌ఎన్‌ఎల్ కేసులో వరంగల్‌లో 3931, మహబూబాబాద్‌లో 7, జనగామలో 2, పరకాల 250 ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 11,203 కేసులు పరిష్కారమయ్యాయి. మోటర్ ఆక్టు చట్టంలో 191 కేసులు పరిష్కారం కాగా వరంగల్‌లో 2,74,31,500 రూపాయలు సెటిల్‌మెంట్ అయింది. మహబూబాబాద్‌లో 11 మోటర్ ఆక్టు కేసులకు గాను 31,90,000రూపాయలు సెటిల్‌మెంట్ అయింది. జనగామలో 2 కేసులకు గాను 6,05,000రూపాయలు సెటిల్‌మెంట్ అయింది. ఈ కార్యక్రమంలో లేబర్ కోర్టు చైర్మన్ జగ్జీవన్‌కుమార్, బి.నర్సింహులు, వై.రేణుక, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి నీలిమ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి మహాత్మ, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.