వరంగల్

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, అక్టోబర్ 17: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. మానుకోట కలెక్టర్ కార్యాలయంలో తొలిసారిగా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజావాణికి భారీగా ప్రజలు తరలివచ్చి 270పిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం కోసం ప్రతి సోమవారం ఉదయం 10.30నుండి మధ్యాహ్నాం 3గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి 15రోజుల్లో పరిష్కరించాలని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మహబూబాబాద్ ప్రజావాణిలో ప్రధానంగా వికలాంగుల సదరన్ సర్ట్ఫికెట్‌లు అందజేయాలని, వృద్దాప్య పెన్షన్‌లు ఇవ్వాలని, డబుల్‌బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇవ్వాలని, భూకభ్జాల సమస్యలను పరిష్కరించాలని, గ్రామాలలో సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్కువగా వినతులు వచ్చాయి. పిర్యాదు దారులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. వచ్చిన పిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.