వరంగల్

ప్రజలతో సన్నిహితంగా మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, అక్టోబర్ 17: పోలీసులు ప్రతి ఒక్కరు తమ వృత్త్ధిర్మాన్ని పాటిస్తూ ప్రజలతో మమేకమై శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని జనగామ డిసిపి వెంకన్న సూచించారు. సోమవారం లింగాలఘణపురం పోలీసుస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పి ఎస్‌లోని పలు రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లా పరిధిలోని మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతో నేరాలను అదుపుచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత చెడుమార్గంలో పయనిస్తుందని, అలాంటి సంఘటనలు పరిగణలోకి తీసుకొని ఆయా గ్రామాల ప్రజల సహకారంతో వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. అలాగే విధి నిర్వాహణలో ప్రతి పోలీసు బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వేణుగోపాల్, పోలీసు సిబ్బంది ఉన్నారు.