వరంగల్

డిజిటల్ క్లాసులను ఉపయోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 22: రూరల్ జిల్లా పరిధిలోని డిజిటల్ క్లాసులు ఉన్న పాఠశాలలు ఈ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని విద్యార్థులకు విద్యాబోధన సక్రమంగా జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులను వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. దీనికోసం ఉపాధ్యాయులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని, వృత్తినైపుణ్యంలో కూడా శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు దరఖాస్తు నమోదు, చివరి తేదీపై ముందస్తు సమాచారం అందించాలని చెప్పారు. కుల, ఆదాయ ధ్రువీకరణ సర్ట్ఫికెట్లు లేని కారణంగా స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తులు అందించలేక స్కాలర్‌షిప్పులను పొందే అవకాశం కోల్పోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పరుచుకుని విద్యార్థులకు అవసరమైన సర్ట్ఫికెట్లను పాఠశాలల్లోనే జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మీ-సేవా దరఖాస్తులు అందచేసి వాటిని పూర్తిచేసిన అనంతరం సంబంధిత తహశీల్దార్‌కు మీ-సేవా ద్వారా అందించేలా చూడాలని, వీటిని పరిశీలించిన అనంతరం తహశీల్దార్లు విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందచేస్తారని చెప్పారు. వసతిగృహాలలో విధిగా వంటగ్యాస్ కనెక్షన్లు ఉపయోగించుకోవాలని, భోజనాల తయారీ కోసం వంటచెరుకు ఉపయోగించ వద్దని స్పష్టం చేసారు. ఉపాధ్యాయులు నిర్ణీత సమయానికి పాఠశాలలకు వెళ్లేలా, నాణ్యమైన విద్యాబోధన జరపటం ద్వారా ఉత్తీర్ణత శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి నిర్మల, ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చిట్యాల, అక్టోబర్ 22: చిట్యాల మండలం గిద్దముత్తారం గ్రామానికి చెందిన పంచిక శంకర్ (30) అనే రైతు శనివారం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. శంకర్ తనకు గల ఎకరం వ్యవసాయ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా పంటలు సాగు చేస్తున్నాడు. అయితే, అశించిన స్థాయిలో దిగుబడి రాక, పెట్టుబడులు సైతం చేతికి అందగా అప్పుల పాలయ్యాడు. అంతేకాకుండా కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులతో మూడు లక్షల రూపాయల మేరకు అప్పులు పెరిగి పోయాయ. ఈ క్రమంలో ఇంట్లో కలతలు చోటు చేసుకోవడంతో శంకర్ మానసిక ఆందోళనకు గురై క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. మృతునికి భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సమర్థవంతంగా అంగన్‌వాడీలు
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు * మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా
మహబూబాబాద్, అక్టోబర్ 22: గ్రామాల్లోని నిరుపేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను మహబూబాబాద్ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఐసిడిఎస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమగ్ర మహిళా శిశు అభివృద్ధి సంస్థ, సమగ్ర పిల్లల రక్షణ సంస్థ, డిఎస్‌డబ్ల్యూ, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ వంటి అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో గ్రామాల్లో శిశు, గర్భిణుల మరణాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సిబ్బంది స్థానికంగా ఉంటూ అంకితభావంతో సక్రమంగా విధులు నిర్వహించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే వారం నుండి అంగన్‌వాడీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఐదు ఐసిడిఎస్ పరిధిలో 1435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, 1152 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, అంతేమంది అంగన్‌వాడీ హెల్పర్లు, 106 మంది మినీ అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. 42,497 మంది పల్లలు అంగన్‌వాడీ సెంటర్‌లో నమోదై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరందరికీ సక్రమంగా పౌష్టిక ఆహారం అందేలా చూడాలని సూచించారు. గ్రామస్థాయిలో విఆర్వోలు, మండల స్థాయిలు తహశీల్దార్‌లు, డివిజన్ స్థాయిలో సిడిపివోలు బాలికల అక్రమ రవాణా అరికట్టే చర్యలను తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సుమలత లెనిన్, సిడిపివో నిర్మల, ఎసిడిపివొ శ్రీదేవి, సూపర్‌వైజర్‌లు ఉషారాణి, సువర్ణ, గీత, రమాదేవి, మమత తదితరులు పాల్గొన్నారు.