వరంగల్

జనవరిలో కాకతీయ ఉత్సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 25: నాలుగు సంవత్సరాల విరామం అనంతరం కాకతీయ ఉత్సవాలకు ముహూర్తం కుదిరింది. వచ్చే ఏడాది జనవరి నెలలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని సాంస్కృతిక, పర్యాటక శాఖలు నిర్ణయించాయి. నాలుగేళ్ల నుంచి కాకతీయ ఉత్సవాలు ఎప్పుడని స్థానికులు, ఇదిగో మరో రెండు, మూడునెలలో అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ కాలం గడిపేయగా తాజాగా హైద్రాబాద్‌లో సోమవారం జరిగిన సాంస్కృతిక, పర్యాటక శాఖల సంయుక్త సమావేశంలో కాకతీయ ఉత్సవాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో 2012 డిసెంబర్ 20న మొదటిసారి అట్టహాసంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేతుల మీదుగా కాకతీయ ఉత్సవాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి సమైఖ్యాంధ్రకు మద్దతు తెలిపిన కారణంగా కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు వారి కార్యక్రమాలను రచ్చరచ్చ చేసారు. కాకతీయ ఉత్సవాల ప్రారంభం రోజునే నగరంలో కొత్తగా నిర్మించిన పర్యాటక శాఖ నిర్మించిన హరిత కాకతీయ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరి గందరగోళం సృష్టించారు. కోటలో జరిగిన కాకతీయ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మాట్లాడనీయకుండా గందరగోళం చేసారు. ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగినా అన్ని రోజులుపాటు జరిగిన ఉత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా, ఆడంబరంగా జరిగాయి. కాకతీయ కళావైభవం, చరిత్ర తదితర అంశాలతో వివిధ కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ప్రతియేటా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఎన్నికలు తదితర కారణాలతో రెండేళ్లపాటు కాకతీయ ఉత్సవాల గురించి ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ఉత్సవాలు ఇప్పుడు, అప్పుడు చెబుతు పాలకులు చెబుతు వచ్చినా ఆచరణలోకి రాలేదు. గడచిన ఆరునెలల నుంచి కాకతీయ ఉత్సవాల గురించి వివిధ సందర్భాలలో ప్రాస్తవన వచ్చిన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, సాంస్కృతిక, పర్యాటక శాఖల ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఈ రెండు శాఖల ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన రచయితలు, చరిత్రకారులతో సమావేశం నిర్వహించి కాకతీయ ఉత్సవాల నిర్వహణ గురించి చర్చించారు. అందరితో సంప్రదింపులు జరిపిన అనంతరం వచ్చే ఏడాది జనవరి నెలలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఈ ఉత్సవాల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళికకు సిద్ధమవుతోంది.