వరంగల్

నేరాల నియంత్రణకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 3: నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు వ్యాపారులు సహకరించాలని జనగామ డిసిపి తేజావత్ వెంకన్న కోరారు. జనగామ పట్టణానికి చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో గురువారం స్థానిక ఎస్‌హెచ్‌వో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చోరీలను నివారించుకోవాలని సూచించారు. ప్రతి వ్యాపార సముదాయంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ఏవేని నేరాలు జరిగితే నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే అనుమానాస్పదంగా వ్యాపార సముదాయాలకు వస్తున్న వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. క్రైమ్ పార్టీలు పట్టణంలో పెట్రోలింగ్ చేస్తున్నాయని, అయినప్పటికీ ప్రజలు, ప్రధానంగా వ్యాపారులు సహకరిస్తేనే నేరాలు పూర్తిగా తగ్గుముఖం పడుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఎసిపి పద్మనాభరెడ్డి, ఎస్‌హెచ్‌వో ముసికె శ్రీనివాస్‌తో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, వ్యాపారులు పజ్జూరి గోపయ్య, రాజేశ్వర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, అశోక్, రవీందర్‌లు పాల్గొన్నారు.