వరంగల్

అప్పుల రాష్ట్రం చేస్తున్న కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, నవంబర్ 6: ముఖ్యమంత్రి కెసిఆర్ తన కొడుకు కెటిఆర్ ముఖ్యమంత్రి కావడానికి వాస్తు పేరుతో రూ. 12వందల కోట్లు వెచ్చించి సచివాలయాన్ని నిర్మిస్తున్నాడని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోరుయాత్ర మహాసభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 16 మంది ముఖ్యమంత్రులు 69వేల కోట్ల అప్పులు తీసుక వస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ రెండున్నర సంవత్సరాలలో లక్ష 7వేల అప్పు తీసుక వచ్చి అప్పుల రాష్ట్రంగా చేశాడని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా లేరన్నారు. తాము పోరుయాత్ర చేపట్టిన అనంతరం రైతులు తాము పడుతున్న కష్టాలు వివరిస్తూ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మీద మహిళలు కోలటాలతో నిరసనలు తెలుపారని, సాయన్న లాంటి కళాకారుడు మళ్లీ గజ్జ కట్టారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిర్వహించిన శాసన సభా సమావేశంలో లక్ష రూపాయల రుణమాఫి చేస్తునట్లు ప్రకటించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతుల అప్పులు బ్యాంకులో రూ. 17వేల కోట్లు ఉన్నాయని మాఫి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం వాస్తవం కాదాని పేర్కొన్నారు. మొదటి బడ్జెట్‌లో లక్ష కోట్లు, రెండవ బడ్జెట్‌లో లక్ష 15 వేల కోట్లు, మూడవ బడ్జెట్‌లో లక్ష 30వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని పేదల రైతులకు కేవలం రూ. 17వేల కోట్లు ఒకేసారి చెల్లించి రుణమాఫి ఎందుకు చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల రుణమాఫికి ఎవరు అడ్డు పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి మాటకు ఆంధ్ర పాలకుల పేర్లు చెప్పే కెసిఆర్ ఏ ఆంధ్ర పాలకుడు అడ్డుపడుతున్నాడో ప్రకటించాలన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్ సబ్సిడి ఇవ్వకుండా ఆంధ్రా కాంట్రాక్టర్‌కు బిల్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫి చేయడం లేదు కాని ఆయన కుటుంబానికి వంద కోట్లు ఖర్చు చేయడం సిగ్గుచేటు అన్నారు. సోనియామిర్జికు రూ. 2 కోట్లు, కవితకు బతుకమ్మ పేరుతో రూ. 25 కోట్లు ఇచ్చారని అయిన మేము తప్పు పట్టడం లేదని నిజామాబాద్‌లో రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక రూపాయి అందచేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. రైతు సమస్యలపై కొదండరాం నివేదిక ఇవ్వడానికి సిఎం దగ్గరకు వస్తే కనీసం సమయం కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగడం లేదని, శ్రీకాంతాచార్య తల్లికి ముఖ్యమంత్రి కెసిఆర్ సమయం కూడా ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ముడు పోయే వారిని కొనుగోలు చేసి టిడిపి లేదని భ్రమలు కల్పించే పరిస్థితులు కలిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ, రాష్ట్ర, జిల్లా , మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

ఊరికి కీడు సోకిందని..
కేసముద్రం, నవంబర్ 6: ఆధునిక సమాజం.. అభివృద్ధి చెందిన శాస్త్ర, సాంకేతిక రంగం ఇంకా మూడనమ్మకాల్లో మునిగితేలుతున్నారనడానికి ఇదో తాజా ఉదారణగా నిలుస్తోంది. కేసముద్రం మండలం మహమూద్ పట్నం శివారు కాలనీతండాలో ఇటీవ ల ఓ వ్యక్తి మృతి చెందగా.. మృతిచెందిన వ్యక్తి చనిపోయిన ‘గడియ’ మంచిది కాదనే ప్రచారం జరిగింది. తండావాసులంతా ఊరి బయట వంట చేయాలని, లేని పక్షంలో తండాకు మరింత కీడు సంభవిస్తుందనే మూడనమ్మకంతో ఊరికి పట్టిన కీడు పోవాలంలే ఊరిబయట వంట చేసుకోవాల్సిందేనని ఎవరో చెప్పిన మాటను నమ్మి.. ఆదివారం తండాకు చెందిన దాదాపు 120 కుటుంబాలు ఊరిబయట ఇలా వంటకు వెళ్లారు.