వరంగల్

ఎన్నాళ్లీ కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 15: నల్లదనాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్లు బ్యాన్ ప్రభావం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాతపెద్దనోట్లు బ్యానై వారం రోజులు కావస్తున్న ఇంకా బ్యాంకులు మామూలు పరిస్ధితికి చేరుకోలేదు. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో మంగళవారం బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఉదయం నుండే ప్రజలు బారులు తీరారు. బ్యాంకు తెరిచిన కొద్దిసేపటికి ఎటిఎంలు పనిచేసినా రెండు గంటల్లోనే ఎటిఎంలు అన్ని ఖాళీ అయ్యాయి. డబ్బులు మార్చుకునేందుకు, విత్‌డ్రా చేసుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూకట్టారు.
ఏ బ్యాంకులకు వెళ్లినా ప్రజలు బారులుతిరే కనిపించారు. ఎటిఎం నుండి 2500 బ్యాంకు నుండి రూ.10వేల లోపే విత్‌డ్రాలకు అవకాశం ఇవ్వడంతో అవసరానికి సరిపడా డబ్బులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకు నుండి విత్‌డ్రా చేసుకునే వినియోగ దారులకు రూ.2వేల కొత్త నోట్లు ఇస్తుండడంతో వీటిని మార్కెట్‌లో మార్చుకోవడం మరీ ఇబ్బందిగా తయారైంది. పెద్దనోట్ల బ్యాన్ ప్రభావంతో వ్యాపారలావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. నోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి దూరప్రయాణాలు సైతం రద్దు చేసుకున్నారు. కార్తీకామాసం, పెండ్లీల సీజన్‌కావడంతో మరిన్ని ఇబ్బందులు తప్పలేదు. చిల్లరకొరత చిరువ్యాపారులపై తీవ్రప్రభావం చూపుతోంది. అయితే పెద్దనోట్లబ్యాన్ పెట్రోల్‌బంక్‌లకు కలిసివస్తుంది. పెట్రోల్‌బంక్‌లలో పాత 500, 1000నోట్లు చెల్లుతాయని కేంద్రం ప్రకటించిన నేపద్యంలో పెట్రోల్‌బంక్‌లో పాతపెద్దనోట్లు తీసుకుంటున్నారు..కాని రౌండ్‌ఫిగర్‌గా పెట్రోల్, డీజిల్ పోస్తున్నారు. ఎంతనోటు ఇస్తే అంత పెట్రోల్, డీజిల్ పోస్తున్నారే తప్పా చిల్లరమాత్రం తిరిగి ఇవ్వడం లేదు. ఈవ్యవహారం పెట్రోల్‌బంకులకు కాసులపంట పండిస్తోంది. దీంతో రోజు జరిగే లావాదేవీలతో పోలిస్తే పెట్రోల్ బంకుల్లో నాలుగింతల అమ్మకాలు పెరిగిపోయాయి. మరో వైపు గత రెండు రోజులుగా వైన్స్, బార్‌షాపులలో పాత పెద్దనోట్లు తీ సుకోవడం మానేశారు. దీంతో మందుప్రియులు చిల్లర కష్టాలు పడుతున్నారు. పెద్దనోట్లు తీసుకోవాలని కొందరు వ్యాపారులు భావిస్తున్నప్పటికి తీసుకున్న నోట్లను తిరిగి మార్పిడి చేయాలంటే వ్యాపారాలు మానుకొని బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్‌లో నిలబడిరావడంతో చిన్న, పెద్ద వ్యాపారులు కూడా పెద్ద నోట్లను తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రూ.2వేల నోటుకు చిల్లర కొరత సమస్యగా మారింది. ఇదే పరిస్ధితి మరో మూడు వారాలుపాటు ఉంటుందని అధికారులు చెపుతుండటంతో సామాన్య ప్రజలు, చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ సమస్య అధిగమించాలంటే తక్షణమే ప్రభుత్వం కొత్త రూ. 500, 50, 20 నోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.