వరంగల్

అభివృద్ధికి బాటలు వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 20: మానుకోట పట్టణ అభివృద్ధికి బాటలు వేద్ధామని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మానుకోటలోని 20వ వార్డు పరిధిలో కలెక్టరేట్ కార్యాలయానికి వెల్లే మార్గంలో రూ.10 లక్షల ఎమ్మెల్యే సిడి ఎఫ్ నిధులతో చేపట్టిన గ్రావెల్ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ భూక్య స్వప్న ప్రవీన్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసిఆర్ దయతో మహబూబాబాద్ జిల్లా ఏర్పడిందని, జిల్లా కేంద్రంగా ఉన్న మానుకోట పట్టణాన్ని అందుకు తగినట్లుగా అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న స్పూర్థితో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసి ఆర్ కృషి చేస్తున్నాడని, ఆయన చూపిన బాటలోనే మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అందరి సహాకారంతో ముందుకు సాగుతున్నానన్నారు. మహబూబాబాద్ పట్టణంలో రోడ్ల విస్తీర్ణ, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలోనే పనులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా మానుకోట పట్టణం ఆశించినంతగా అభివృద్ధి చెందలేక పోయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలు మానుకోటలో చేపట్టడం జరిగిందన్నారు. అన్ని వర్గాలు సంపూర్ణ సహాకారాన్ని అందిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి ఫలాలను మహబూబాబాద్ పట్టణం అందుకుంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ భూక్య స్వప్న ప్రవీన్‌నాయక్ మాట్లాడుతూ...మానుకోట పట్టణంలోని 20వ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గతంలోనే అనేక రకాల సహాయ సహాకారాలను అందించారన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గ్రావెల్ రోడ్డుతో వార్డు పరిధిలోని నాలుగు కాలనీల రోడ్డు సమస్య కొంత వరకు తీరుతుందని, రానున్న కాలంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఇదే రకమైన సహాకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, ప్రవీన్‌నాయక్, డోలి లింగుబాబు, చౌడవరపు రంగారావు, నిమ్మల శ్రీనివాస్, పెద్ది వెంకన్న, భూక్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది
నల్లబెల్లి, నవంబర్ 20: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌరసరపారల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండలంలో నిర్మిస్తున్న గోదాంలను పరిశీలించారు. గోదాం పనులు నాసిరకంగా ఉండడంతో పెద్ది అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గోదాం డిఇతో ఫోన్‌లో మాట్లాడారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ధర్మరావుపల్లిలో ఏర్పాటు చేసిన విలేఖరుల పమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 2 వేల కోనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చిందన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు 1800 మద్దతు ధర కల్పించడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48గంటల లోపే రైతు ఖాతలో డబ్బులు జమచేయడం జరుగుతుందని వివరించారు.