వరంగల్

సర్కార్ క్షమాభిక్ష పెట్టినా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. అందులో భాగంగా వరంగల్ జిల్లాలో వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 70 మంది ఖైదీలను విడుదల చేయగా ఇప్పటికే 59 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చారు. అయితే ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జిఓ 38 ప్రకారం విడుదల చేసినప్పటికి శిక్షతో పాటు కోర్టు విధించిన జరిమాన చెల్లించలేక పలువురు ఖైదీలు జైలులోనే ఉండిపోవాల్సివచ్చింది. కరీంనగర్ జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన మొగిళిచర్ల రాజేశ్వరి అనే వృద్ధురాలు గత పది సంవత్సరాలుగా జైలులోనే శిక్ష అనుభవిస్తుంది. అతని కొడుకు కూడా ప్రస్తుతం జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే రాజేశ్వరికి ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేస్తున్నప్పటికి ఆమె చెల్లించాల్సిన జరిమాన రూ.17,500 లేకపోవడంతో జైలులోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాజీపేట సహృదయ వృద్ధాశ్రమం యాజమాన్యం ముందుకు వచ్చి రాజేశ్వరి చెల్లించాల్సిన రూ.17,500 జరిమానతో పాటు 850 మనియార్డర్ ఖర్చులను కూడా చెల్లించి గురువారం రాజేశ్వరిని జైలు నుండి బయటకు తీసుకొచ్చారు. అయితే రాజేశ్వరి కొడుకు కూడా జైలులోనే ఉండడంతో ఆ వృద్ధురాలు పోషణను కూడా సహృదయ వృద్ధాశ్రమం కల్పించారు.